Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉలవల పరోటా

సత్తు పిండిలిట్టీ ఉలవల పరోటా

వీకెండ్‌ వచ్చిందంటే చాలు... వెరైటీ ఫుడ్‌ను టేస్ట్‌ చేయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు సత్తు పిండితో చేసే లిట్టీలు, ఉలవలతో చేసే పరోటా, మసాలా తమలపాకుల వడలు, బ్లాక్‌ సోయాబీన్స్‌తో చేసే భట్వానీ కర్రీ...వంటి రెసిపీలను ట్రై చేయండి. ఆ వంటల తయారీ విశేషాలు ఇవి...


కావలసినవి: ఉలవలు - 25 గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - మూడు రెబ్బలు, గోధుమపిండి - అరకేజీ.


తయారీ విధానం: ఉలవలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని కాసేపు ఉడికించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉలవలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. గోధుమపిండిని మెత్తగా కలుపుకొని ఉలవల మిశ్రమాన్ని కూరి పరోటాలు తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పెనంపెట్టి పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటాపచ్చి బొప్పాయి రొట్టెసజ్జ రొట్టెపుదీనా పరోటాకీటో రోటీహైదరాబాదీ బిదారీ పరాటాపాలకొల్లు దిబ్బరొట్టిఉల్లితో జొన్నరొట్టె (వీడియో) దాల్‌ పరోటామేథీ పరోటా
Advertisement