భారతీయ విద్యార్థులకు బ్రిటన్ తీపికబురు !

ABN , First Publish Date - 2020-09-23T15:02:32+05:30 IST

భారతీయ విద్యార్థులకు బ్రిటన్ సర్కార్ తీపికబురు అందించింది.

భారతీయ విద్యార్థులకు బ్రిటన్ తీపికబురు !

లండన్: భారతీయ విద్యార్థులకు బ్రిటన్ సర్కార్ తీపికబురు అందించింది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్(ఐహెచ్ఎస్) చెల్లించడం ద్వారా భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు తమ ఇమ్మిగ్రేషన్ అనుమతి కాలానికి ఆరోగ్య సర్‌చార్జిని సరిగ్గా చెల్లిస్తే ఆరోగ్య సౌకర్యాలను ఉచితంగా పొందుతారని యూకే స్పష్టం చేసింది.


దీని ద్వారా భారతీయ విద్యార్థులు స్థానిక వైద్యుల సలహాలు, అత్యవసర సేవలు, ఐహెచ్ఎస్ కింద అవసరమైన ఆస్పత్రి చికిత్సలను పొందవచ్చని పేర్కొంది. ఐహెచ్ఎస్ అనేది యూకే వీసా దరఖాస్తులో ఒక భాగం. అలాగే విద్యార్థి, యువత మొబిలిటీ వీసాల కోసం సంవత్సరానికి రూ. 28వేలు(£300) వసూలు చేస్తుంది. భారతీయ కుటుంబాలు విదేశీ విద్య కోసం యూకేను నమ్మకంగా ఎంపిక చేసుకోవచ్చని బ్రిటన్ స్టడీ గ్రూప్, ఈయూ ఎండీ జేమ్స్ పిట్‌మ్యాన్ అన్నారు. ఎందుకంటే తమ దేశం అద్భుతమైన ఆరోగ్య సేవలకు ప్రసిద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T15:02:32+05:30 IST