అతిపెద్ద మ్యూజియాన్ని కాపాడుకునే పనిలో ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-06T23:18:50+05:30 IST

ఈ విషయమై ఆ మ్యూజియం డైరెక్టర్ ఇహోర్ కోజాన్ మాట్లాడుతూ ‘‘ఒక వైపు యుద్ధం.. మరొక వైపు ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో మనుషులను మ్యూజియం రక్షణ కోసం ఉపయోగించుకోవడం.. కొన్నిసార్లు కన్నీళ్లు ఆగడం లేదు. దీనికి సమయం..

అతిపెద్ద మ్యూజియాన్ని కాపాడుకునే పనిలో ఉక్రెయిన్

కీవ్: 11 రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యాను గట్టిగానే ప్రతిఘటిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ బాగానే నష్టపోతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలతో పాటు ప్రజా నివాసాలు నేలమట్టం అవుతున్నాయి. అయితే ఇప్పటికీ యుద్ధ తీవ్రత తూర్పు ప్రాంతంలోనే ఉంది. పశ్చిమాన అంత తీవ్రత లేదు. దీంతో పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉన్న ఒక మ్యూజియాన్ని కాపాడుకునేందుకు అక్కడి ప్రభుత్వం తక్షణ చర్యల్లోకి దిగింది. ఉక్రెయిన్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం అయిన ఆండ్రే షెప్టిట్‌స్కీ నేషనల్ మ్యూజియంలోని వస్తువులను ఒక్కోటి జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలోకి తరలిస్తున్నారు. 18వ శతాబ్బానికి చెందిన కొన్ని వస్తువులు ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనలో పెట్టారు. ముందుగా వాటిని సురక్షిత ప్రదేశంలోకి పంపిస్తున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.


ఈ విషయమై ఆ మ్యూజియం డైరెక్టర్ ఇహోర్ కోజాన్ మాట్లాడుతూ ‘‘ఒక వైపు యుద్ధం.. మరొక వైపు ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో మనుషులను మ్యూజియం రక్షణ కోసం ఉపయోగించుకోవడం కష్టంగా ఉంది. కొన్నిసార్లు కన్నీళ్లు ఆగడం లేదు. దీనికి సమయం, శక్తి చాలా అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో మేం చేస్తున్న పని మంచిదే. కానీ ఖాళీ గోడల్ని చూడడం చాలా కష్టం. ఇది మనసును చాలా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయం ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అని అన్నారు. ఈ మ్యూజియం ల్వివ్ నగరంలో ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి మూసివేసే ఉంది. ఈ మ్యూజియంలోని 12,000 వస్తువులను బాక్సుల్లో ప్యాక్ చేసి సురక్షిత పరుస్తున్నారు.

Updated Date - 2022-03-06T23:18:50+05:30 IST