Russia-Ukraine War: రష్యా బలగాలు వెనక్కి మళ్లాలన్న ఉక్రెయిన్..36 దేశాల విమానాలను నిషేధించిన రష్యా

ABN , First Publish Date - 2022-03-01T01:32:31+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నేటికి ఐదు రోజులు. వైమానిక దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది

Russia-Ukraine War: రష్యా బలగాలు వెనక్కి మళ్లాలన్న ఉక్రెయిన్..36 దేశాల విమానాలను నిషేధించిన రష్యా

బెలారస్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నేటికి ఐదు రోజులు. వైమానిక దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. రష్యా దురాక్రమణ కారణంగా ఇప్పటి వరకు 352 మంది పౌరులు చనిపోయినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. మరోవైపు బెలారస్ సరిహద్దులో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.


రష్యా వెంటనే తన సేనలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అణు నిరోధక దళాలను రెడీ చేయాలని ఆదేశించారు. రష్యా విమానాలను నిషేధించిన దేశాల జాబితాలో బెల్జియం, ఫిన్లాండ్, కెనడా కూడా చేరాయి. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు ప్రకటించాయి. 


ఇంకోవైపు, రష్యా ఏకంగా 36 దేశాల విమానాలను నిషేధించింది. ఈ మేరకు ఆ దేశ మీడియా ‘స్పుత్నిక్’ పేర్కొంది. ఉక్రెయిన్‌కు దురాక్రమణకు దిగిన నేపథ్యంలో పలు దేశాలు రష్యా విమానాలు తమ దేశంలోకి ప్రవేశించకుండా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసేశాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఈ ప్రతీకార ప్రకటన చేసింది. యూకే, జర్మనీ సహా పలు దేశాలు రష్యా నిషేధిత జాబితాలో ఉన్నాయి. 


అలాగే, ఉక్రెయిన్‌తోపాటు క్రిమియా, డోన్‌బాస్ నుంచి కూడా రష్యన్ దళాలు వెనుదిరగాలని ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేసినట్టు కూడా ‘స్పుత్నిక్’ పేర్కొంది. 

Updated Date - 2022-03-01T01:32:31+05:30 IST