భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి తొలగింపు

ABN , First Publish Date - 2022-07-10T13:15:50+05:30 IST

భారత్‌తో పాటు మరో నాలుగుదేశాల్లో ఉక్రెయిన్‌ రాయబారులను ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తొలగించారు.

భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి తొలగింపు

కీవ్‌, జూలై 9: భారత్‌తో పాటు మరో నాలుగుదేశాల్లో ఉక్రెయిన్‌ రాయబారులను ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తొలగించారు. ఈ మేరకు అధ్యక్షుడి వెబ్‌సైట్‌లో ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక కారణాన్నీ అందులో వెల్లడించకపోవడం గమనార్హం. భారత్‌ కాకుండా జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌, నార్వే, హంగరీ ఈ జాబితాలో ఉన్నాయి. జర్మనీ రష్యాపై ఇంధన సరఫరాకోసం ఆధారపడి ఉండటంతో ఉక్రెయిన్‌కు, ఆ దేశానికి మధ్య బంధం అంతంతమాత్రంగానే ఉంది. మరి ఇతర దేశాల రాయబారులనూ కీవ్‌ ఎందుకు తొలగించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2022-07-10T13:15:50+05:30 IST