మూడు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-03-04T20:09:31+05:30 IST

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ గత వారంలో

మూడు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ గత వారంలో మూడు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ నేతృత్వంలోని ప్రభుత్వ వర్గాల మద్దతుగల రెండు అనధికారిక సైనిక బృందాలు జెలెన్‌స్కీని హత్య చేసేందుకు ప్రయత్నించాయని చెప్తోంది. 


జెలెన్‌స్కీని హత్య చేయాలనే లక్ష్యంతో వాగ్నెర్ గ్రూపు, చెచెన్ స్పెషల్ ఫోర్సెస్ బృందాలను కీవ్ నగరానికి క్రెమ్లిన్ మద్దతుతో పంపించారని తెలిపింది. అయితే జెలెన్‌స్కీ భద్రతా దళం ఈ విషయాన్ని పసిగట్టినట్లు తెలుసుకుని, రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌లోని యాంటీ వార్ ఎలిమెంట్స్ ఈ బృందాలను నిలువరించాయని తెలిపింది. 


కీవ్‌లో జెలెన్‌స్కీని హత్య చేసేందుకు ప్రయత్నిస్తూ వాగ్నెర్ మెర్సినరీస్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపింది. వీరి కదలికలను ఉక్రెయినియన్లు ఎంత నిశితంగా గమనిస్తున్నారో తెలియజేస్తూ వీరిని నిలువరించినట్లు పేర్కొంది. జెలెన్‌స్కీ భద్రతా దళానికి ఈ వివరాలు ఎలా తెలుస్తున్నాయో లేశమాత్రంగానైనా సమాచారం అందడం లేదని ఈ బృందానికి సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలిపింది. 


ఉక్రెయిన్‌పై యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరింది. 

Updated Date - 2022-03-04T20:09:31+05:30 IST