రష్యా ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంటు ఆమోదం

ABN , First Publish Date - 2022-03-04T01:39:28+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య వరుసగా ఎనిమిదో రోజూ యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ మొదలైనప్పటి

రష్యా ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంటు ఆమోదం

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య వరుసగా ఎనిమిదో రోజూ యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్ నుంచి రష్యా సేనల ఉపసంహరణకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఓటు వేసింది.


కీవ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే రాజధానిని వదిలిపెట్టాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. కాగా, ఉక్రెయిన్ పార్లమెంటు నేడు కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. దేశంలో రష్యాకు కానీ, ఆ దేశ పౌరులకు కానీ చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే చట్టాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. 


Updated Date - 2022-03-04T01:39:28+05:30 IST