ఉక్రెయిన్‌లో తమిళుల రక్షణకు ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2022-02-25T15:51:01+05:30 IST

ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తమిళులను రక్షించే చర్యలు చేపట్టినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వారిని

ఉక్రెయిన్‌లో తమిళుల రక్షణకు ప్రభుత్వం చర్యలు

                            -  ప్రత్యేక నెంబర్ల విడుదల


పెరంబూర్‌(చెన్నై): ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తమిళులను రక్షించే చర్యలు చేపట్టినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసు కొచ్చేలా దౌత్యాధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళులు 044-28515288, 9600023645, 9940256444 ఫోన్‌ నెంబర్లు, www. nrta mils.tn.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించాలని ప్రభుత్వం తెలియజేసింది.


Updated Date - 2022-02-25T15:51:01+05:30 IST