ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థుల తరలింపు

ABN , First Publish Date - 2022-03-04T18:54:46+05:30 IST

ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను తరలించేందుకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలైన కార్గి, కీవ్‌ నగరాల్లో రష్యా నిప్పుల

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థుల తరలింపు

                  - ప్రత్యేక కమిటీ నియమాకం


ప్యారీస్‌(చెన్నై): ఉక్రెయిన్‌ దేశంలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను తరలించేందుకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలైన కార్గి, కీవ్‌ నగరాల్లో రష్యా నిప్పుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో, అక్కడ చిక్కుకున్న భారత విద్యార్థులను విడిపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయ త్నాలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో చదువు కోసం ఉక్రెయిన్‌ దేశానికి వెళ్లి చిక్కుకున్న తమిళ విద్యార్థులను సురక్షితంగా విడిపించే నిమిత్తం రాష్ట్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, కళానిధి వీరాస్వామి, ఎంఎం అబ్దుల్లా, ఎమ్మెల్యే టీఆర్‌బీ రాజా, నలుగురు ఐఏఎస్‌ అధికారు లున్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లో ఉన్న 2,223 మంది రాష్ట్ర విద్యార్థుల్లో ఇప్పటివరకు 193 మంది రాష్ట్రానికి తిరిగొచ్చినట్లు సచివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-03-04T18:54:46+05:30 IST