ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దాడులు

ABN , First Publish Date - 2022-03-13T07:54:01+05:30 IST

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శరణార్థులు తలదాచుకున్న ప్రాంతాలు, నివాస సముదాయాలు,..

ఉక్రెయిన్‌లో  కొనసాగుతున్న దాడులు

మారియుపోల్‌లో మసీదుపై బాంబులు

అందులో 86 మంది టర్కీ జాతీయుల షెల్టర్‌

రష్యా సరిహద్దుల్లో 12 వేల అమెరికా సైన్యం 

ఐఎన్‌ఎస్‌ కూలిపోవొచ్చు.. రష్యా బెదిరింపులు


కీవ్‌, మార్చి 12: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శరణార్థులు తలదాచుకున్న ప్రాంతాలు, నివాస సముదాయాలు, గ్రామాల్లో గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. మారియుపోల్‌లో టర్కీ జాతీయులు తలదాచుకున్న ఓ మసీదుపై షెల్స్‌తో దాడి చేసింది. ఖార్కివ్‌, ఖెర్సోన్‌, మైకొలైవ్‌, కీవ్‌, చెర్నిహీవ్‌ నగరాలపైనా దాడులను ఆపలేదు. శనివారం తాజాగా వాసిల్కివ్‌ నగరంలోని చమురు నిల్వలను టార్గెట్‌గా చేసుకుంది. కాగా.. రష్యాకురష్యా దురాక్రమణ ప్రారంభమయ్యాక.. మారియుపోల్‌లోని టర్కీ జాతీయులు ఓ మసీదులో తలదాచుకుంటున్నారు. శనివారం ఆ మసీదుపై రష్యా వైమానిక దళాలు దాడులు చేశాయి. ఆ మసీదులో 34 మంది పిల్లలు సహా.. 86 మంది తమ దేశస్తులు ఉన్నట్లు టర్కీ ఆందోళన వ్యక్తం చేసింది. మైకొలైవ్‌లో ఓ క్యాన్సర్‌ ఆస్పత్రిపై వైమానిక దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆస్పత్రిలో 100 మందికి పైగా రోగులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. ఖార్కివ్‌లో షెల్స్‌తో జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులు, ఓ యువకుడు మృతిచెందినట్లు, ఖార్కివ్‌లో భవనంపై జరిగిన బాంబుదాడిలో ఒకరు మరణించినట్లు ఆయా నగరాల మేయర్లు తెలి పారు. కాగా.. డెడ్లీ స్నైపర్‌గా పేరున్న ఫ్రెంచ్‌-కెనెడియన్‌ వలీ ఉక్రెయిన్‌ తరఫున యుద్ధరంగంలోకి దిగారు. రోజుకు 40 మంది శత్రు సైనికులను మట్టుబెట్టగలరని వలీకి పేరుంది.


ఐఎ్‌సఎ్‌సపై రష్యా బెదిరింపులు

తమపై ఆంక్షలను ఉపసంహరించుకోకుంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)కు ముప్పు ఉంటుందంటూ నాసా, కెనెడా, ఐరోపా దేశాల అంతరిక్ష సంస్థలకు రష్యా హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఓ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఐఎ్‌సఎస్‌ కూలిపోవచ్చంటూ రష్యా అంతరిక్ష కేంద్రం రోస్కోస్మోస్‌ చీఫ్‌ దిమిత్రి రొగోజిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఎ్‌సఎ్‌సలో నలుగురు నాసా వ్యోమగాములు, ఇద్దరు రష్యా కాస్మొనాట్స్‌, ఐరోపాకు చెందిన ఒక ఆస్ట్రోనాట్‌ ఉన్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ను నిషేధించిన రష్యా.. సోమవారం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌పైనా అలాంటి ఆంక్షలకు సిద్ధమవుతోంది.


మేం దాడిచేస్తే..: బైడెన్‌

రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి సీఫుడ్స్‌, ఆల్కహాల్‌, వజ్రాల దిగుమతిపై నిషేధం విధించింది. రష్యాపై తాము గానీ, నాటోగానీ రంగంలోకి దిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు.'


ఉక్రెయిన్‌ నుంచి వస్తానన్నాడు 

భారతీయ విద్యార్థి సాయినికేష్‌ తండ్రి

యుద్ధంలో పోరాడేందుకు ఉక్రెయిన్‌  బలగాల్లో చేరిన తమిళనాడు విద్యార్థి సాయినికేష్‌ ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చేందుకు అంగీకరించాడని ఆయన తండ్రి రవిచంద్రన్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తన కొడుకును స్వదేశానికి తీసుకొస్తామని కేంద్రప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయని వివరించారు. మూడు రోజుల క్రితం తాను సాయినికే్‌షతో మాట్లాడానని చెప్పారు. ఆ తరువాత అందుబాటులోకి రాలేదన్నారు.

Updated Date - 2022-03-13T07:54:01+05:30 IST