ఆపరేషన్ స్మైల్తో తప్పిపోయిన వారికి అండగా పోలీసులు

ABN , First Publish Date - 2022-01-06T01:28:50+05:30 IST

"ఆపరేషన్ స్మైల్"తో తప్పిపోయిన వారికి అండగా పోలీసులు

ఆపరేషన్ స్మైల్తో తప్పిపోయిన వారికి అండగా పోలీసులు

డెహ్రాడూన్: "ఆపరేషన్ స్మైల్" పేరుతో ఉత్తరాఖండ్ పోలీసులు కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో తప్పిపోయిన వారిని వెతికి పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మూడు నెలలపాటు చేపట్టిన "ఆపరేషన్ స్మైల్" ద్వారా  తప్పిపోయిన 1072 మంది పిల్లలు, యుక్తవయస్కులు, వృద్ధులు, యువకులు మరియు ఇతరులను వారి కుటుంబాలకు పోలీసులు అప్పగించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అశోక్ కుమార్ మంగళవారం ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులను సత్కరించారు. సెప్టెంబరు 15, 2021 నుంచి డిసెంబర్ 15, 2021 వరకు ఆపరేషన్ స్మైల్‌ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్ సమయంలో 1,072 మంది తప్పిపోయిన వ్యక్తులను కనుగొని వారి కుటుంబాలకు తిరిగి చేర్చామని పోలీసులు వెల్లడించారు. వీరిలో 345 మంది పిల్లలు, 397 మంది మహిళలు, మిగిలినవారు పురుషులు ఉన్నారని చెప్పారు.


ఉత్తరాఖండ్ పోలీసులు 2015లో ఆపరేషన్ స్మైల్‌ను ప్రారంభించారని, ఇప్పటివరకు దాదాపు తప్పిపోయిన 3,255 మంది వారి కుటుంబాలతో తిరిగి కలిశారని డీజీపీ తెలిపారు. షెల్టర్‌హోమ్‌లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాలలో నివసించే పిల్లలు, మహిళలు మరియు వృద్ధుల కుటుంబాలను కనుగొనడానికి తాము ప్రయత్నించామని, పిల్లల చెప్పిన వివరాలతోపాటు ఇతర మార్గాల సహాయంతో తాము వీటిని సాధించామని డీజీపీ కుమార్ చెప్పారు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మా నాన్న కోసం చాలా చోట్ల వెతికామని.. కానీ నాన్నను కనుగొనలేదని సమీర్ ఏఎన్‌ఐతో చెప్పారు. తాము సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని సమీర్ పేర్కొన్నారు. హరిద్వార్ రైల్వే స్టేషన్‌లో ఒక పోలీసు అధికారి మా నాన్నను తన ఇంటికి తీసుకొచ్చాడని తప్పిపోయిన బాధితుడి కుమారు సమీర్ చెప్పారు. ఆశ్రమం నడుపుతున్న బల్వంత్ సింగ్ మాట్లాడుతూ ఆశ్రమంలో ఉంటున్న చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి చెప్పలేరని అన్నారు. పోలీసుల సహకారంతో ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులను తమ కుటుంబాలకు అప్పగించినట్లు సింగ్ చెప్పారు.

Updated Date - 2022-01-06T01:28:50+05:30 IST