మహిళకు తీవ్ర జలుబు.. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి కూడా నిద్రపోయింది కానీ.. కళ్లు తెరిచేసరికి 20ఏళ్ల జ్ఞాపకాలు మాయం

ABN , First Publish Date - 2022-02-25T02:02:40+05:30 IST

ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే ఓ రోజు రాత్రి నిద్రపోయిన ఆమె.. కళ్లు తెరిచే సరికి తన గతాన్ని మర్చిపోయింది. పెళ్లి జరగడం, పిల్లలు పుట్టడం, వాళ్లను స్కూల్‌లో చేర్పించడం వంటి ఆ

మహిళకు తీవ్ర జలుబు.. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి కూడా నిద్రపోయింది కానీ.. కళ్లు తెరిచేసరికి 20ఏళ్ల జ్ఞాపకాలు మాయం

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే ఓ రోజు రాత్రి నిద్రపోయిన ఆమె.. కళ్లు తెరిచే సరికి తన గతాన్ని మర్చిపోయింది. పెళ్లి జరగడం, పిల్లలు పుట్టడం, వాళ్లను స్కూల్‌లో చేర్పించడం వంటి ఆనందకర విషయాల తాలూకు 20ఏళ్ల జ్ఞాపకాలను ఆమె మరిచింది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందిన క్లైర్ మప్ఫెట్ అనే మహిళకు స్కాట్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. జాక్, మాక్స్ అనే ఇద్దరు కొడుకులకు కూడా ఈ దంపతులు  తల్లిదండ్రులయ్యారు. గత ఏడాది జూన్‌లో తీవ్ర జలుబుతో బాధపడిన క్లైర్.. ఎప్పటిలాగే ఫాదర్స్‌ డేకు ముందు రోజు రాత్రి తన గదికి వెళ్లి నిద్రపోయింది. తరువాత రోజు ఉదయం తిరిగి ఆమె కళ్లు తెరవలేదు. తీవ్ర ఆస్వస్థతకు గురవ్వడంతో క్లైర్‌ను ఆమె భర్త స్కాట్ దగ్గర్లోని ఆసుపత్రికి తీసకెళ్లాడు. ఆ తర్వాత వైద్యుల సూచలన మేరకు అక్కడి నుంచి ఆమెను రాయల్ లండన్ హాస్పిటల్‌కు తరలించాడు. 



అక్కడ క్లైర్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె మెదడువాపుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆ క్రమంలో 16 రోజులపాటు కోమాలోకి వెళ్లిన క్లైర్.. తర్వాత కోమా నుంచి బయటకొచ్చింది. అయితే కళ్లు తెరిచే సరికి ఆమె తన 20ఏళ్ల గతాన్ని మర్చిపోయింది. పెళ్లి కావడం, గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం సహా వారిని స్కూల్‌లో జాయిన్ చేయడం వంటి విషయాలన్నింటిని ఆమె మర్చిపోయింది. కానీ తన భర్త, పిల్లలు సహా పరిచయం ఉన్నవారందరూ తనకు జ్ఞాపకం ఉన్నారు. ‘వరల్డ్ ఎన్సిఫాలిటిస్ (మెదడువాపు) డే’ సందర్భంగా ఫిబ్రవరి 22న సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని క్లైర్ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది.



Updated Date - 2022-02-25T02:02:40+05:30 IST