ఏడేళ్లప్పుడు తొలిసారిగా దాన్ని చూసింది.. అప్పటి నుంచి భయంలోనే జీవిస్తున్న మహిళ.. ఇంటి గడప దాటకుండా..

ABN , First Publish Date - 2022-04-26T23:45:44+05:30 IST

ఏలియన్స్‌ను చూశామనే చెప్పుకునే వారి జీవితాల్లో ఒక్కోసారి అనూహ్య మార్పులు సంభవిస్తుంటాయి. ఏలియన్స్ వల్ల తమకు అపాయం పోంచి ఉందని భయపడిపోతుంటారు. అలాంటి అర్థరహిత భయంలో మునిగిపోయిన ఓ బ్రిటన్ మహిళ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

ఏడేళ్లప్పుడు తొలిసారిగా దాన్ని చూసింది.. అప్పటి నుంచి భయంలోనే జీవిస్తున్న మహిళ.. ఇంటి గడప దాటకుండా..

ఎన్నారై డెస్క్: ఏలియన్స్ ఉన్నారా లేరా అనే అంశంపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. గ్రహాంతరవాసులు ఉండరని కొందరు తేల్చేస్తే.. తాము ఏలియన్స్‌ను స్పేస్‌షిప్స్‌ను చూశామంటూ మరికొందరు బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు. ఇదో ఎడతెగని డిబేట్. అదలా ఉంచితే.. ఏలియన్స్‌ను చూశామనే చెప్పుకునే వారి జీవితాల్లో ఒక్కోసారి అనూహ్య మార్పులు సంభవిస్తుంటాయి. ఏలియన్స్ వల్ల తమకు అపాయం పోంచి ఉందని భయపడిపోతుంటారు. అలాంటి అర్థరహిత భయంలో మునిగిపోయిన ఓ బ్రిటన్ మహిళ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.  


లివర్‌పూల్ నగరంలో నివసించే 51 ఏళ్ల సాషా క్రిస్టీకి ఏలియన్స్ పేరెత్తితే చాలు వణుకు వచ్చేస్తుంది.  తను బయటకు వస్తే ఏలియన్స్ ఎత్తుకుపోతారని భయపడిపోయే ఆమె.. సాధారణంగా ఇంటికే పరిమితమవుతుంది. అప్పుడప్పుడూ మాత్రమే బటయకు వస్తుంటుంది. ‘‘ఏలియన్స్ భూమ్మిద ఎక్కువగా ఎక్కడ దిగుతుంటారో నేను చెప్పలేను కానీ.. వారు నా సమీపంలోను ఉన్నట్టు నాకు తరచూ అనిపిస్తుంటుంది. ఇంట్లోంచి కాలు బటయపెట్టాలంటేనే వణుకు మొదలవుతుంది. బయటకు వెళ్లిన సమయాల్లో ఆకాశంవైపు అస్సలు చూడలేను.  నెక్స్ట్‌ ఏం చూడాల్సి వస్తుందో అనే భయంతో తలపైకెత్తను’’ అని ఆమె చెప్పుకొచ్చింది.


ఇప్పటివరకూ తాను తొమ్మిది సార్లు ఏలియన్స్ చూశానని ఓ సందర్భంలో స్థానిక మీడియాతో క్రిస్టీ చెప్పుకొచ్చింది. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తొలిసారిగా ఏలియన్స్ చూసినట్టు పేర్కొంది. అంతేకాకుండా.. తనకు కనిపిస్తున్న గ్రహాంతర వాసులు ఇతరులకు ఎందుకు కనిపించరని కూడా ప్రశ్నిస్తుంది క్రిస్టీ.  ఒకానొక సందర్భంలో ఓ గ్రహాంతరవాసి తన పక్కనుంచి పరిగెత్తుకుంటూ వెళ్లాడని, ఆ సమయంలో ఏదో వింత కాంతి తన పక్క నుంచి వెళ్లినట్టు తన భర్త కూడా చూసినట్టు పేర్కొంది. అంతేకాకుండా..తన పక్క నుంచి వెళ్లే సమయంలో ఏలియన్ తనను ఢీకొట్టినంత పని చేయడంతో తాను ఆందోళనకు గురయ్యానని, దాని నుంచి తప్పించుకునేందుకు ఏటు వైపు వెళుతున్నానో కూడా ఆలోచించకుండా పరిగెత్తడం మొదలెట్టానని క్రిస్టీ తెలిపింది. ఇలా తరచూ ఏలియన్స్ ఎదురుపడుతుండటంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై చివరకు ఇంటి బయట కాలుపెట్టేందుకు ఇష్టపడని పరిస్థితికి చేరుకుంది. అప్పుడప్పుడు యూఎఫ్ఓ కన్వెషన్లకు హాజరవుతుంది. ఏలియన్స్ చూశామని చెప్పుకునే వాళ్లు హాజరయ్యే సమావేశం అది. అక్కడ క్రిస్టీ.. తన లాంటి ఎందరినో కలుస్తుంటుంది. వారందరూ తమ భయాలు, అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకుని స్వాంతన పొందే ప్రయత్నం చేస్తుంటారు. 



Updated Date - 2022-04-26T23:45:44+05:30 IST