‘గీతం’ను సందర్శించిన యూకే బృందం

ABN , First Publish Date - 2022-05-26T05:43:29+05:30 IST

యునెటైడ్‌కింగ్‌డం నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి విద్యావేత్తల ప్రతినిధిబృందం బుధవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ ప్రాంగణాన్ని సందర్శించింది.

‘గీతం’ను సందర్శించిన యూకే బృందం
గీతం అధికారులతో చర్చిస్తున్న యూకే బృందం

పటాన్‌చెరు రూరల్‌, మే 25: యునెటైడ్‌ కింగ్‌డం నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి విద్యావేత్తల ప్రతినిధిబృందం బుధవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ ప్రాంగణాన్ని సందర్శించింది. నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం, గీతం మధ్య భావి విద్యా సహకారం గురించి ఆ ప్రతినిధి బృందం చర్చించినట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ పి. త్రినాథరావు వెల్లడించారు. బ్రిటన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే అభిలాష ఉన్న విద్యార్థులతో వారు ముఖాముఖి చర్చించడంతో పాటు ఆ విశ్వవిద్యాలయం అందజేస్తున్న ప్రోత్సాహక స్కాలర్‌షి్‌పల గురించి కూడా వివరించినట్టు తెలియజేశారు. ఈ ప్రతినిధి బృందంలో జార్జ్‌గ్రీన్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఫర్‌ ఎలకో్ట్రమాగ్నెటిక్స్‌ రీసెర్చ్‌ సభ్యుడు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్టీవ్‌ గ్రీడ్‌, బయోటెక్నాలజీ ప్రోగ్రామ్స్‌ డెరైక్టర్‌ డాక్టర్‌ నాగమణి బోరా, స్టూడెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజర్‌(అడ్మిషన్స్‌) లూసీ రోజ్‌, ఇంటర్నేషనల్‌ పార్ట్నర్‌షిప్‌ మేనేజర్‌ మ్యాట్‌ బోన్నర్‌ ఉన్నట్టు వివరించారు. గీతం కెరీర్‌ గైడైన్స్‌ సెల్‌ డెరైక్టర్‌ డాక్టర్‌ వేణుకుమార్‌ నాతి నేతృత్వంలోని గీతం అధ్యాపకుల బృందం వారితో చర్చలో పాల్గొన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-26T05:43:29+05:30 IST