Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రిటన్‌లో సులభతరం కానున్న విద్యార్థి వీసాలు

యుకె విశ్వవిద్యాలయాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులందరినీ ప్రత్యక్ష బోధనకు అనుమంతించేందుకు సిద్ధమవుతున్నట్లు బ్రటిష్ కౌన్సిల్ దక్షిణ భారత సంచాలకురాలు జనక పుష్పనాథన్ తెలిపారు. 


కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఆమె చెప్పారు. వీసా నిబంధనల సడలింపుతో గత రెండేళ్లలో 197 శాతం మంది విద్యార్థులు అధికంగా బ్రిటన్‌కు వచ్చారని ఆమె పేర్కొన్నారు.


2019లో 30,496, 2020లో 45,677 మందికి వీసాలు జారీ అయ్యాయని.. ఈ సంఖ్య 2021 సంవత్సారానికిగాను 90,669కి చేరిందన్నారు. జనవరి 4న బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యూకెలో విద్యావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ మేళా జరుగనుంది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement