70 ఏళ్లుగా లైసెన్స్ లేని కారు డ్రైవర్.. ఒక్కసారిగా అతడికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-31T05:46:08+05:30 IST

ఈ రోజుల్లో కారు లేదా బైక్ తీసుకొని రోడ్డుపై వెళ్లాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా అన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేకుంటే ట్రాఫిక్ పోలీసులు చలానాలతో మోత మోగించేస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 70 ఏళ్లుగా అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్నాడు. రోడ్లపై ఫ్రీగా తిరుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి కూడా అతనికి పోలీసులు ఆపలేదు. కానీ ఇటీవలే ఆ సీనియర్ సిటిజెన్...

70 ఏళ్లుగా లైసెన్స్ లేని కారు డ్రైవర్.. ఒక్కసారిగా అతడికి ఏం జరిగిందంటే..

ఈ రోజుల్లో కారు లేదా బైక్ తీసుకొని రోడ్డుపై వెళ్లాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా అన్ని డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేకుంటే ట్రాఫిక్ పోలీసులు చలానాలతో మోత మోగించేస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 70 ఏళ్లుగా అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్నాడు. రోడ్లపై ఫ్రీగా తిరుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి కూడా అతనికి పోలీసులు ఆపలేదు. కానీ ఇటీవలే ఆ సీనియర్ సిటిజెన్ పోలీసుల పెట్రోలింగ్‌లో పట్టుబడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ దేశంలోని నాటంగ్‌హమ్ ప్రాంతంలో ఇటీవలే పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ కారు నడుపుతున్న ఒక 84 ఏళ్ల వృద్ధుడిని ఆపారు. ఆయన పోలీసులు ఆపగానే కారు పక్కకు ఆపి..  డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా అన్ని పత్రాలు చూపించమని అడిగారు. దానికి ఆ పెద్ద మనిషి చెప్పిన సమాధానం విని పోలీసులు నోరేళ్లబెట్టారు. తన దగ్గర ఇన్సూరెన్స్ లేదని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఆ సీనియర్ సిటిజెన్ సమాధానం ఇచ్చాడు. అందుకు పోలీసులు ఇంట్లో మరిచిపోయారా అని ప్రశ్నించగా.. అసుల తను ఎప్పుడూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదని చెప్పాడు. 


తాను 1938లో జన్మించానని ఆ డ్రైవర్ చెప్పాడు. తన 12వ యేట నుంచి కారు డ్రైవింగ్ చేస్తున్నానని.. అప్పటి నుంచి తాను లైసెన్స్ అనేదే ఎరుగనని  వివరించాడు. తనను ఎప్పుడూ పోలీసులు ఆపలేదని చెప్పాడు. అంతేకాదు, అదృష్టవశాత్తు యాక్సిడెంట్లు కూడా కాలేవని, ఆ విధంగా తాను పోలీసులకు ఎదురుబడలేదని చెప్పాడు. ఈ సమాధానాలను పోలీసులు తొలుత నమ్మలేకపోయారు. తర్వాత అన్ని వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాత నమ్మక తప్పలేదు. ఈ సంఘటనని పెట్రోలింగ్ చేసిన పోలీసులు ఇటీవల సోషల్ మీడియోలో షేర్ చేశారు. 


నాటింగ్‌హామ్‌లో ప్రస్తుతం ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) అనే పద్ధతి ద్వారా పోలీసులు రోడ్డుపై తిరిగే వాహనాల గురించి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో అక్కడ ఏదైనా వాహనంపై కేసులు, చలానాలు ఉండి.. వాటిని చెల్లించకుండా బయటికి తిరిగినా.. లేదా లైసెన్స్, రిజెస్ట్రేషన్ లాంటి ఇతర దస్తావేజులు సక్రమంగా లేకపోయినా పోలీసులు ఇట్టే పట్టేస్తారు.


Updated Date - 2022-01-31T05:46:08+05:30 IST