వచ్చేవారం భారత్‌కు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

ABN , First Publish Date - 2022-04-16T02:34:40+05:30 IST

లండన్ : యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వచ్చేవారం భారత సందర్శనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు.

వచ్చేవారం భారత్‌కు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్ : యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వచ్చేవారం భారత సందర్శనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఐక్యరాజ్యసమితిలో ఇండియా ఓటింగ్ విధానం, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు వంటి కీలకమైన అంశాలను బోరిస్ జాన్సన్ ప్రస్తావించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కీలకమైన యూకే - ఇండియా ఎఫ్‌టీఏ(ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) పురోగతిపై ఇరువురి మధ్య చర్చకు రానుంది. నూతన యూకే- ఇండియా రక్షణ, భద్రత భాగస్వామ్యం విషయంలో పెద్ద ప్రకటనలు ఉండే అవకాశాలున్నాయి. జాన్సన్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 22న  ఆయనకు ఘనస్వాగతం లభించనుంది. అదేరోజు అధికారిక చర్చలు జరగనున్నాయి.


 రష్యాతో బంధాలను బలహీనపరచుకోవాలంటూ భారత్‌పై యూకే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశమూ లేకపోలేదు. కాకపోతే అమెరికా స్థాయిలో యూకే విజయవంతమవ్వకపోవచ్చుననే విశ్లేషణలున్నాయి. బోరిస్ జాన్సన్ పర్యటనతో ఎఫ్‌టీఏ ఒప్పందం విషయంలో మాత్రమే ఫలితం దక్కవచ్చుననే అంచనాలున్నాయి.

Updated Date - 2022-04-16T02:34:40+05:30 IST