బ్రిటన్ ప్రధానిపై రష్యా నిషేధం..!

ABN , First Publish Date - 2022-04-17T03:06:30+05:30 IST

రష్యాలోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అనుమతి లేదంటూ రష్యా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది.

బ్రిటన్ ప్రధానిపై రష్యా నిషేధం..!

ఎన్నారై డెస్క్: రష్యాలోకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అనుమతి లేదంటూ రష్యా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది. రష్యాపై దూకుడుగా బ్రిటన్  ఆంక్షలు అమలు చేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ ప్రధానితో పాటూ ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్, డిఫెన్స్ సెక్రెటరీ బెన్ వాలెస్, 10 మంది ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలపై కూడా ఈ నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాలోకి త్వరలో మరింత మంది బ్రిటన్ ప్రముఖులను చేరుస్తామని హెచ్చరించింది. అంతకుమునుపు బ్రిటన్ రష్యా అధికారులపై వివిధ రకాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా..రష్యా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఇటీవల బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించారు. 

Updated Date - 2022-04-17T03:06:30+05:30 IST