భారత సంతతి డ్యాన్సర్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2020-08-02T21:52:51+05:30 IST

బ్రిటన్‌లో భారత సంతతి డ్యాన్సర్‌కు అరుదైన గౌరవం లభించింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజల బాగోగుల గురించి ఆలోచించిన భారత సంతతి డ్యాన్సర్ రా

భారత సంతతి డ్యాన్సర్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం!

లండన్: బ్రిటన్‌లో భారత సంతతి డ్యాన్సర్‌కు అరుదైన గౌరవం లభించింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజల బాగోగుల గురించి ఆలోచించిన భారత సంతతి డ్యాన్సర్ రాజీవ్ గుప్త‌ాపై.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌ లాక్‌డౌన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో రాజీవ్ గుప్తా.. యూకే వాసుల కోసం ఫ్రీగా.. భాంగ్రా డ్యాన్స్ క్లాస్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఈ డ్యాన్స్ క్లాస్‌లు ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం గత నెలలో  రాజీవ్ గుప్తాకు ‘పాయింట్ ఆఫ్ లైట్’ అవార్డును అందించింది.  ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీవ్ గుప్తాకు ఓ లేఖ రాశారు. అందులో.. ‘లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీ డ్యాన్స్ క్లాస్‌లు ఉపయోగపడ్డాయి. విపత్కర పరిస్థితుల్లో మీరు చాలా మందికి ‘పాయింట్ ఆఫ్ లైట్’గా నిలిచారు. మిమ్మల్ని ఇలా గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని లేఖపట్ల రాజీవ్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనను ‘పాయింట్ ఆఫ్ లైట్’గా గుర్తించినందుకు కృతజ్ఙతలు తెలిపారు. కాగా.. సమాజంలో మార్పు కోసం పని చేసే ప్రజలు, వాలంటీర్లను బ్రినట్ ప్రభుత్వం.. ప్రతివారం గుర్తించి, ‘పాయింట్ ఆఫ్ లైట్’ అవార్డును అందిస్తుంది.  


Updated Date - 2020-08-02T21:52:51+05:30 IST