ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన బ్రిటన్ ప్రధాని

ABN , First Publish Date - 2022-04-10T02:48:36+05:30 IST

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శనివారం సమావేశం అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా విధానాలను ముందు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్న బ్రిటన్ ప్రధాని.. తానే స్వేయంగా కీవ్ వెళ్లి..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన బ్రిటన్ ప్రధాని

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శనివారం సమావేశం అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా విధానాలను ముందు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్న బ్రిటన్ ప్రధాని.. తానే స్వేయంగా కీవ్ వెళ్లి జెలెన్‌స్కీని కలుసుకోవడం విశేషం. ఈ ఇద్దరు నేతలు సమావేశమైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ ఫొటోను లండన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘సర్‌ప్రైజ్’’ అని రాసుకొచ్చింది.


‘‘కీవ్ సందర్శనకు వచ్చిన బోరిస్ జాన్సన్.. ఇప్పుడ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వ్యక్తగతంగా చర్చ ప్రారంభించారు’’ అని అధ్యక్షుడి సహాయకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే ఇద్దరు అధినేతల ఫొటో షేర్ చేస్తూ ‘‘ఉక్రెయిన్‌కు రక్షణలో బ్రిటన్ కీలక ప్రాధాన్యత పోషిస్తోంది’’ అని మరో పోస్ట్ పెట్టారు. అయితే ఉక్రెయిన్‌కు తమ ప్రజల తరపున మద్దతును చూపించేందుకే బోరిస్ కీవ్‌కి వచ్చారని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. ‘‘ఉక్రెయిన్‌కు ఎక్కువ కాలం మద్దతుపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు ఆర్థిక, రక్షణ సహాయంపై చూడా చర్చించనున్నారు’’ అని ఈ సమావేశానికి ముందు ఒక కీలక నేత చెప్పినట్లు యూరప్‌కు చెందిన ఒక మీడియా సంస్థ పేర్కొంది.

Updated Date - 2022-04-10T02:48:36+05:30 IST