'వర్క్ ఫ్రం హోం' చేసుకోండి: బ్రిటన్ ప్రధాని

ABN , First Publish Date - 2020-09-22T22:18:26+05:30 IST

బ్రిటన్‌లో మహమ్మారి కరోనా ఉధ‌ృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్... దేశ ప్రజలను వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని చెప్పారు.

'వర్క్ ఫ్రం హోం' చేసుకోండి: బ్రిటన్ ప్రధాని

లండన్: బ్రిటన్‌లో మహమ్మారి కరోనా ఉధ‌ృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్... దేశ ప్రజలను వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని చెప్పారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి రెండో దశలోకి ప్రవేశించిందని పరిశోధకులు చెబుతున్నందున సాధ్యమైనంతవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలోనే పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్‌లపై కూడా త్వరలోనే కొత్త నిషేధాజ్ఞలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కొత్త కేసుల పెరుగుదల రోజుకు 6వేల వరకు ఉండగా, ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య కూడా ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతోందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ప్రజలు కార్యాలయాలకు వెళ్లి పని చేయడం ప్రారంభించి కొన్ని వారాలు కూడా గడవకముందే మంగళవారం ప్రధాని మరోసారి వర్క్ ఫ్రం హోంను ప్రకటించారు. ఇక కరోనా విషయంలో బ్రిటన్‌ చాలా దుర్భల స్థితిలో ఉందని ఆ దేశ అత్యున్నత వైద్య సలహాదారుడు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-09-22T22:18:26+05:30 IST