Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారెవ్వా.. 48ఏళ్ల వయసులో.. 9 గంటల్లోనే 51 పబ్‌లను చుట్టేశాడు..

ఇంటర్నెట్ డెస్క్: 48ఏళ్ల వ్యక్తి చేసిన ఓ పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం తొమ్మిది గంటల్లో 51 పబ్‌లను విజిట్ చేయడమేకాకుండా.. ప్రతి పబ్‌లోనూ డ్రింగ్ తాగి అందిరిని ఔరా అనిపించాడు. కాగా.. 9 గంటల్లో అతడు 51 పబ్‌లను ఎందుకు విజిట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుని పలువురు ఆశ్చర్యపోతునున్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అతడి గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


యూకేకు చెందిన మ్యాట్‌ ఎల్లిస్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ పబ్‌లను సందర్శించి అక్కడ డ్రింక్ కూడా సేవించడం ద్వారా ప్రజల దృష్టికి ఆకర్షించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు 8 గంటల 52 నిమిషాల్లో ఏకంగా 51 పబ్‌లను సందర్శించాడు. అంతేకాకుండా వెళ్లిన ప్రతి చోట.. 125ఎంఎల్‌ల డ్రింగ్ తాగి వెనుతిరిగాడు. దీంతో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పబ్‌లు సందర్శించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందడం కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేసుకున్నాడు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు సంతోషానికి దూరమైనట్లు అభిప్రాయపడ్డారు. ఎప్పటిలాగే ప్రజలు పబ్‌లకు వచ్చి ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చేందుకే.. ఈ పని చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థుల సమక్షంలోనే తాను సుమారు 9 గంటల్లో 51 పబ్‌లను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేసినట్లు స్పష్టం చేశారు. తన దరఖాస్తును గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఒకే చేస్తే.. ఈ ఫీట్ సాధించిన ఏకైక వ్యక్తిని తానే అవుతాననే మ్యాట్ ఎల్లిస్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2011లో 13 మంది సభ్యుల బృందం 24 గంటల్లో 250 పబ్‌లను విజిట్ చేసి, వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement