‘‘అమ్మాయిలూ.. నన్ను కాపాడండి.. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది’’.. పెళ్లి కోసమని ఓ యువకుడు వీధుల వెంట..

ABN , First Publish Date - 2022-01-05T01:38:24+05:30 IST

ఓ వయసు వచ్చాక ఆడా, మగా ఇద్దరూ తోడు కోసం వెతుక్కుంటున్నారు. ఓ ఇంటివారై లైఫ్‌లో సెటిలవుదామనుకుంటారు.

‘‘అమ్మాయిలూ.. నన్ను కాపాడండి.. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది’’.. పెళ్లి కోసమని ఓ యువకుడు వీధుల వెంట..

ఇంటర్నెట్ డెస్క్: ఓ వయసు వచ్చాక ఆడా, మగా ఇద్దరూ తోడు కోసం వెతుక్కుంటారు. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవుదామనుకుంటారు. అప్పటికే గర్ల్‌ఫ్రెండో బాయ్‌ఫ్రెండో ఉంటే వారినే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా..టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక విదేశాల్లో అయితే.. చిట్టచివరి ప్రయత్నంగా స్నేహితులు బంధువుల ద్వారా పరియమైన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కుదిరితే వివాహం చేసుకుంటారు. అయితే..బ్రిటన్‌కు చెందిన మహ్మద్ మాలిక్‌కు ఇలాంటి బోలెడు ప్రయత్నాలు చేసినా ఎందుకో కాలం కలిసి రావట్లేదు. తనకు జోడి అయిన అమ్మాయి కోసం అతడి వెతుకులాట ఇప్పటివరకూ నిరాశే మిగిల్చింది. చివరికి అతడు ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. తాను ఉంటున్న బర్మింగ్‌హామ్ నగర వీధుల్లో పెద్ద పెద్ద బిల్ బోర్డులపై భారీ ప్రకటనలు ఇచ్చాడు. ‘‘నన్ను అరెంజ్డ్ మ్యారేజ్ నుంచి కాపాడండి’’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. 


కొన్నాళ్లుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న మాలిక్.. ఎందరో యువతులను కలిసాడు గానీ.. వారెవ్వరూ తనకి తగిన జోడి కాదని మాలిక్‌కు అనిపించింది. ‘‘ఇప్పటివరకూ నాకు సరైన జోడీ కుదరలేదు. బయట పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది.’’ అని చెప్పాడు. చివరికి బంధువుల ద్వారా కూడా సంబంధాల కోసం ప్రయత్నించడం ప్రారంభించాడు. అయితే.. అంతకంటే ముందే తానే స్వయంగా ఓ తోడు వెతుక్కునేందుకు ఇలా కొత్త పద్ధతిలో ట్రై చేస్తున్నాడు. ఆసక్తిగల యువతులు అతడిని సంప్రదించేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్ కూడా ప్రారంభించాడు. అతడిని సంప్రదించాలనుకున్న యువతులు ముందుగా వెబ్‌సైట్‌లో ఉన్న ఓ ఫారమ్ నింపి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక తన ప్రొఫైల్ వివరాలు తెలిపే ఓ వీడియోను కూడా మాలిక్ ఆ వెబ్‌సైట్‌లో పెట్టాడు. యువతుల్లో తనకు నచ్చిన లక్షణాలేవో కూడా పేర్కొన్నాడు. అయితే.. ఈ ప్రకటనలకు అతడు ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ రావడంతో అతడు ఉబ్బితబ్బిబైపోతున్నాడు. త్వరలో తన పెళ్లైపోతుందని చెబుతున్నాడు.

Updated Date - 2022-01-05T01:38:24+05:30 IST