Guinness World Record లక్ష్యంగా 24గంటల్లో ఈ 29ఏళ్ల యువకుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-23T15:26:33+05:30 IST

అతడికి ప్రస్తుతం 29ఏళ్లు. ప్రస్తుతం అతడు చేసిన ఓ పని ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 24 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి అక్కడ పానీయాలను సేవించాడు. ఈ క్రమంలోనే ఒక్క రోజులో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా Guinness World

Guinness World Record లక్ష్యంగా 24గంటల్లో ఈ 29ఏళ్ల యువకుడు ఏం చేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 29ఏళ్లు. ప్రస్తుతం అతడు చేసిన ఓ పని ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 24 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి అక్కడ పానీయాలను సేవించాడు. ఈ క్రమంలోనే ఒక్క రోజులో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా Guinness World Record రికార్డులో స్థానం సంపాదించాడు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతానికి చెందిన గ్యారెత్ ముర్ఫీకి ప్రస్తుతం 29ఏళ్లు. ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు.. ప్రజల దృష్టిని ఆకర్షించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా.. 24 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి అక్కడ రకరకాల పానీయాలను కూడా సేవించాడు. దీంతో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా అతడు గిన్నీస్ వరల్డ్ రికార్డు‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన మ్యాట్ ఎల్లీస్ అనే వ్యక్తి.. 2021లో 51పబ్‌లను సందర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే అతడి రికార్డును గ్యారెత్ బద్దలు కొట్టాడు. 


Updated Date - 2022-06-23T15:26:33+05:30 IST