నీరవ్ మోదీని ఇండియాకు రప్పించేందుకు లైన్ క్లియర్

ABN , First Publish Date - 2021-04-16T23:32:34+05:30 IST

విదేశాలకు పారిపోయిన ఆయనపై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్​ను విచారించేందుకు భారత్​కు అప్పగించాలని లండన్ కోర్టు ఫిబ్రవరి 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది.

నీరవ్ మోదీని ఇండియాకు రప్పించేందుకు లైన్ క్లియర్

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను బ్రిటన్ హోంమంత్రి పూర్తి చేసి ప్రభుత్వానికి పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన ఆయనపై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్​ను విచారించేందుకు భారత్​కు అప్పగించాలని లండన్ కోర్టు ఫిబ్రవరి 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది.

Updated Date - 2021-04-16T23:32:34+05:30 IST