కరోనా దెబ్బకు 2 శాతం పడిపోయిన యూకే జీడీపీ

ABN , First Publish Date - 2020-05-13T22:30:08+05:30 IST

కొవిడ్‌-19 లాక్‌డౌన్ కారణంగా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడింది. ఈ ఏడాది మార్చి వరకు తొలి త్రైమాసికంలో ..

కరోనా దెబ్బకు 2 శాతం పడిపోయిన యూకే జీడీపీ

లండన్: కొవిడ్‌-19 లాక్‌డౌన్ కారణంగా యూకే ఆర్ధిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడింది. ఈ ఏడాది మార్చి వరకు తొలి త్రైమాసికంలో దేశ ఆర్ధిక వ్యవస్థ 2 శాతం క్షీణించింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత ఓ త్రైమాసికంలో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. ‘‘కరోనా వైరస్ ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా పడింది.  మార్చి త్రైమాసికంలో దాదాపు అన్ని అనుబంధ రంగాలు తీవ్ర పతనం చవిచూశాయి...’’ అని జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్ఎస్) ఇవాళ వెల్లడించింది. ఒక్క మార్చి నెలలో నమోదైన 5.8 శాతం అతిపెద్ద జీడీపీ క్షీణతతో కలిపి 2008 సంక్షోభం తర్వాత ఇప్పటి వరకు ఇంతటి పతనం చూడలేదని ఓఎన్ఎస్ తెలిపింది. గతేడాది చివరి త్రైమాసికంలో్ కూడా యూకే జీడీపీలో 80 శాతంగా ఉన్న సేవారంగంపై తీవ్ర ప్రభావం పడడంతో సున్నా శాతం వృద్ధి నమోదైంది. 

Updated Date - 2020-05-13T22:30:08+05:30 IST