ఐస్‌క్రీమ్ చల్లగా ఉందంటూ కస్టమర్ ఫిర్యాదు.. రీఫండ్ ఇచ్చి బోరుమన్న రెస్టారెంట్ నిర్వహకుడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-12T02:57:06+05:30 IST

ఐస్ క్రీమ్ అన్నాక చల్లగానే ఉంటుంది. దాని పేరులోనే ఐస్ అన్న పదం ఉంది. ఇది తెలిసి కూడా ఓ కస్టమర్ ఐస్‌క్రీమ్ చల్లాగా ఉందంటూ ఫిర్యాదు చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఐస్ క్రీమ్ డెలివరీ చేసిన రెస్టారెంట్ యజమాని కస్టమర్ కోరిన విధంగా అతడు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఐస్‌క్రీమ్ చల్లగా ఉందంటూ కస్టమర్ ఫిర్యాదు.. రీఫండ్ ఇచ్చి బోరుమన్న రెస్టారెంట్ నిర్వహకుడు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఐస్ క్రీమ్ అన్నాక చల్లగానే ఉంటుంది. దాని పేరులోనే ఐస్ అన్న పదం ఉంది. ఇది తెలిసి కూడా ఓ కస్టమర్ ఐస్‌క్రీమ్ చల్లాగా ఉందంటూ ఫిర్యాదు చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఐస్ క్రీమ్ డెలివరీ చేసిన రెస్టారెంట్ యజమాని కస్టమర్ కోరిన విధంగా అతడు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. 


మనదేశంలో స్విగ్గీ, జొమాటో ఉన్నట్టే బ్రిటన్‌లో జస్ట్ ఈట్ అనే ఫుడ్ డెలివరీ సంస్థ ఉంది. అయితే..ఫుడ్ డెలివరీ రంగంలో బ్రిటన్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో జస్ట్ ఈట్ తన ప్రత్యర్థులకంటే ఓ అడుగు ముందుండాలనే క్రమంలో ఓ కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రెస్టారెంట్లు తప్పు చేసిన సందర్భాల్లో కస్టమర్లు కోరిన వెంటనే వారు చెల్లించిన డబ్బులు ఆటోమేటిక్‌గా వాపస్ అయిపోతాయి(రీఫండ్). ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రెస్టారెంట్ల నిర్వహకులు 30 రోజుల లోపల జస్ట్ ఈట్ దృష్టికి తీసుకురావచ్చు. అయితే..  అంతకుమునుపు మాత్రం రెస్టారెంట్లను ముందుగా సంప్రదించాకే జస్ట్ ఈట్ రీఫండ్‌ను ఆమోదించేది. 


ప్రస్తుతం సంస్థ తెచ్చిన ఈ కొత్త విధానం అక్కడి రెస్టారెంట్లకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఓ కస్టమర్ నాలుగు మిల్క్ షేక్స్, ఓ ఐస్‌క్రీమ్ ఆర్డరిచ్చి.. అవి చల్లాగా ఉన్నాయంటూ విచిత్ర ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత రీఫండ్‌ కోరాడు. అతడు కోరిన వెంటనే రీఫండ్ జారీ అవడంతో తాను నష్టపోయానంటూ ఆ రెస్టారెంట్ యజమాని బోరుమన్నాడు. ఈ కొత్త విధానంలో తల బొప్పికడుతోందని వాపోయాడు. పలువురు తుంటరి కస్టమర్లు ఈ విధాన్ని దుర్వినియోగ పరుస్తూ తమకు నష్టాలు తెస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రేటర్ మాంచెస్టర్‌ కౌంటీలోని ఓల్డమ్‌ ప్రాంతంలో గల లక్కీ రెస్టారెంట్ యజమాని ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితి ఇది. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2021-12-12T02:57:06+05:30 IST