Electricity Bills: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంస్థ.. కరెంటు బిల్లుల కోసం నెల నెలా రూ.18వేల బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన!

ABN , First Publish Date - 2022-08-22T18:28:47+05:30 IST

ఉద్యోగులకు తమ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ద్రవ్యల్బోణం కారణంగా ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే.. మరోవైపు కరెంటు బిల్లుల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత భారీగా కరెంట్ ఛార్జీలు(Electricity Bills) పెరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ సంస్థ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.

Electricity Bills: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంస్థ.. కరెంటు బిల్లుల కోసం నెల నెలా రూ.18వేల బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన!

ఎన్నారై డెస్క్: ఉద్యోగులకు తమ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ద్రవ్యల్బోణం కారణంగా ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే.. మరోవైపు కరెంటు బిల్లుల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత భారీగా కరెంట్ ఛార్జీలు(Electricity Bills) పెరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ సంస్థ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా.. కరెంటు బిల్లులు కట్టుకోవడానికి నెల నెల దాదాపు రూ.18వేలు బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి నోటీస్ జారీ అయ్యే వరకు ఈ బోనస్‌లను ఉద్యోగులు అందుకోవచ్చని చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


జీతం ఇస్తున్నాం కదా అని కొందరు యజమానులు.. ఉద్యోగులతో గొడ్డు చాకిరి చేయించుకుంటారు. మరికొందరేమో.. పని తీరును బట్టి, సంస్థలో పని చేసే కొందరు ఉద్యోగులకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇంకొందరు మాత్రం.. పని చేయించుకుంటూనే వారి సమస్యల తీర్చేందుకు కృషి చేస్తుంటారు. డబ్బుదేముంది ఈ రోజు వస్తుంది రేపు పోతుంది అని ఆలోచించి.. కష్టాల్లో, ఆపదలో ఉద్యోగులకు అండగా నిలుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ కోవకు చెందిన యజమాని గురించే.



యూకే ఫోన్స్ సిస్టమ్ కంపెనీ(UK company) అయిన 4కామ్(4Com) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డారన్ హట్(Daron Hutt) తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే యూకేలో కరెంటు బిల్లులు.. అక్కడి ప్రజల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. వచ్చే శీతాకాలం నాటికి ఎలక్ట్రిసిటీ బిల్లులు(Power Bills) మరింత భారీగా పెరగనున్నాయనే వార్తలు వెలువెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4Com సంస్థ ఉద్యోగుల ఇబ్బందులను గ్రహించింది. ఉద్యోగులు(Employees) కరెంట్ బిల్లులు కట్టే క్రమంలో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో.. 431 మంది ఉద్యోగులకు నెల నెలా 200పౌండ్ల(సుమారు రూ.18,800)ను బోనస్‌గా జీతంలో జమచేయనున్నట్టు ప్రకటించింది. తదుపరి నోటీస్ జారీ అయ్యేవరకు ఈ బోనస్ నెల నెలా శాలరీలో జమవుతుందని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-08-22T18:28:47+05:30 IST