హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా ఉజ్జల్ భూయాన్ (Ujjal Bhuyan) ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళిసై (Tamilisai) ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మరోవైపు హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి