Abn logo
Apr 13 2021 @ 00:10AM

కసాపురంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు

గుంతకల్లు, ఏప్రిల్‌12: ఉగాది ఉత్సవాలకు మండలంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ముస్తాబైంది. దేదీప్యమానమైంది. మంగళవారం నుంచి ఆలయంలో తెలుగు కొత్త సంవత్సర ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలు, ప్రాకారాలు, ప్రధాన ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించగా, ఆల య పరిసరాలు దేదీప్యమానమయ్యాయి. ఉత్సవాలకు పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు సదుపాయాల కల్పనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు. సోమవారం సాయంత్రం నుంచే భక్తులు ఆలయానికి రావడం ప్రారంభించారు.


నేడు ఆలయంలో పూజాదికాలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కసాపురం ఆలయంలో మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకం, స్వర్ణ, వజ్రకవచాలంకరణ, పుష్పాలంకరణలు చేసి, ప్రాతఃకాల అర్చన నిర్వహిస్తారు. అనంతరం సుదరకాండ, వేద పారాయణాలు గావిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నిక అర్చన, మహానివేదన, మహా మంగళహారతి, సాయంత్రం 5 గంటలకు అర్చక వర్గంచే పంచాగ శ్రవణం, సాయంత్రం అరున్నర గంటలకు శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు గరుడ వాహనోత్సవంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
Advertisement