Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 08:56:09 IST

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పర్వదినం

twitter-iconwatsapp-iconfb-icon
షడ్రుచుల సమ్మేళనం ఉగాది పర్వదినం

                - పలువురు నేతల శుభాకాంక్షలు


చెన్నై: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పర్వదినమని, ఈ పర్వదినం రోజున పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వున్న తెలుగువారంతా శనివారం తెలుగు సంవత్సరాదిని ఆహ్వానిస్తూ, పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మామిడితోరణాలతో ఇళ్ల లోగిళ్లను అలంకరించి పూజలు చేసి  ఉగాది పచ్చడిని ఆరగిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభరోజున పంచాంగపఠనం చేస్తారు. రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు సైతం తెలుగు ఉగాదినే అనుసరించడం విశేషం. ఇక కన్నడ, మరాఠీలు సైతం శనివారమే ఉగాది జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు తెలుగు, కన్నడ, మరాఠీ, సింధీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.  


శాంతి, సామరస్యం వెల్లివిరియాలి: గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి...

ఉగాది, గుడిపడ్వా, చెటిచంద్‌ పండుగలను ఘనంగా జరుపుకోనున్న తెలుగు, కన్నడ, మరాఠీ, సింధీ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కోలాహలంగా ఈ పండుగ చేసుకునేవారందరికీ అభినందనలు. ఉగాది పండుగ సందర్భంగా శాంతి, సామరస్యం వెల్లివిరిసి భారతదేశం సంపన్న దేశంగా మారాలని శపథం చేయాలి. ఈ పండుగ అందరిలోనూ సవాళ్ళను ఎదుర్కొనేలా శక్తిసామర్థ్యాలు పెంపొందాలని, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. 


పలువురు నేతల శుభాకాంక్షలు

టీఎన్‌సీసీ నేత అళగరి, పీఎంకే అధినేత డాక్టర్‌ రాందాస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ రాష్ట్ర మీడియా విభాగ కార్యదర్శి పి.రంగనాయకులు, టీఎంసీ అధినేత జీకే వాసన్‌, ఏఎంఎంకే నేత దినకరన్‌ తదితరులు తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 


పటిష్ఠ బంధం : సీఎం స్టాలిన్‌

రాష్ట్రంలో ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోనున్న తెలుగు, కన్నడ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి, మామిడి తోరణాల అలంకరణలు, నూతన వస్త్రధారణలతో శనివారం ఉగాదిని ఘనంగా జరుపుకోనున్న తెలుగు, కన్నడ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రంలో భాషాపరమైన మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుంది. తెలుగు వారి మనోభావాలను గౌరవించి దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఉగాది పండుగను ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చరిత్రాత్మకంగా వింధ్య పర్వతాల శ్రేణికి దక్షిణాన గల ద్రావిడ ప్రజలు భాషాపరంగా, సాంస్కృతికపరంగా అనేక సారూప్యతను కలిగి ఉన్నారు. ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీరి మధ్య బంధం పటిష్టం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఐకమత్యాన్ని చాటిచెప్పే విధంగా రాష్ట్రంలోను, పొరుగు రాష్ట్రాలలోను ఈ ఉగాది వేడుకలను జరుపుకోనున్న తెలుగు, కన్నడ భాషా సోదరులందరికీ అభినందనలు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.