హాంగ్‌కాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2022-04-11T19:45:34+05:30 IST

కొవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య గత రెండు సంవత్సరాలుగా ఉగాది వేడుకలను నిర్వహించలేక పోయారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎట్టకేలకు జూమ్ ద్వారా వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాం

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ఎన్నారై డెస్క్: కొవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య గత రెండు సంవత్సరాలుగా ఉగాది వేడుకలను నిర్వహించలేక పోయారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎట్టకేలకు జూమ్ ద్వారా వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య  ప్రధాన కార్యదర్శి జయ పీసపాటి ప్రారంభించారు. శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ ఉగాది వేడుకలను నిర్వహించారు.


తెలుగు ఎన్నారై idol ద్వితీయ విజేత గాయని హర్షిణీ తన అద్భుతమైన గాత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. చిన్నారులు అక్షిత, దీక్షిత, ఇషిక, గుణ, స్వర్ణిక, లహరి, విద్య, సారా, జయంత్, అద్వైత్‌తోపాటు పెద్దలు మనోజ్, శ్రీహరి బాలాదిత్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శనల్లో శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, కూచిపూడి నృత్యం, సుమతీ శతకాలు, శాస్త్రీయ వాయిద్యం మరియు భజన ఉండటం ఉగాది వేడుకలకు అదనపు అందాన్ని ఇచ్చాయి. 



అధ్యక్ష ప్రసంగంలో వ్యవస్థాపకురాలు జయ పీసపాటి మాట్లాడుతూ.. ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య పురోగతి గురించి వివరించారు. మాతృభూమిలోని కొవిడ్ బాధఇతులకు సంస్థ ఆపన్నహస్తం అందించినట్టు తెలిపారు. అంతేకాకుండా స్థానిక వలస కార్మికులకు సేవలు అందజేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించి ఆర్ధిక సహాయం అందజేసేనట్లు చెప్పారు. ఏటా ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారాలతో విశిష్ట సామాజిక సేవలు చేసిన వారిని గుర్తించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు. కొవిడ మహమ్మారి సమయాలలో సామాజిక మానవీయ దృక్పథంతో సేవలు అందజేస్తున్న స్థానిక భారతీయులను సమాఖ్య గుర్తించి.. కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాఘవేంద్రన్, నందిని, సోనల్ శా, దీప్తి రామచంద్రన్ హాజరయ్యారు. సమాఖ్య సభ్యులు వీరిని సత్కరించారు. అలాగే హాంకాంగ్ వాస్తవ్యులైన కుంజ్ గాంధీని, టెస్స లైసన్స్‌ని తమ ఫేస్బుక్ గ్రూప్ “HKQSG” ద్వారా కొవిడ్ సమయంలో అందరికీ అందించిన సహాయ సహకారాలను కొనియాడారు. ఈ సందర్భంగా రాఘవేంద్రం మాట్లాడుతూ.. తాము 2015 నుంచి సేవలు ప్రారంభించినా ఇప్పటి వరకూ వాటిని ఎవరూ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సమాఖ్యని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలుగు సమాఖ్య ముఖ్య కార్యవర్గ సభ్యులు ప్రసంగిస్తూ వేడుకల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు అభినందనలు తెలిపారు. ఫ్రంట్‌లైన్ కార్యకర్తలను హర్షధ్వానాలతో అభినందించారు. జై తెలుగు తల్లి , జై హింద్ అనే నినాదాలతో వేడులకను ముగించారు. 




Updated Date - 2022-04-11T19:45:34+05:30 IST