పలువురికి ఉగాది పురస్కారాలు

ABN , First Publish Date - 2021-04-13T04:57:31+05:30 IST

ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.

పలువురికి ఉగాది పురస్కారాలు
కొత్తపల్లె శ్రీనును సత్కరిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 12: ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ  కళాకారుడిగా రాణిస్తున్న కొత్తపల్లె శ్రీనును నెల్లూరు జిల్లాకు చెందిన పినాకియూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉగాది జాతీయ పురష్కారంతో  ప్లవనామ ఉగాది సందర్భంగా నెల్లూరు టౌన్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ఉగాది జాతీయ సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఆయనకు మెమెంటో, సర్టిఫికెట్లు ప్రదానం చేసి దుశ్శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విక్రమసింహ పూరి యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ సుదర్శన్‌రావు, నెహ్రూయువకేంద్రం జిల్లా అధికారి మహేంద్రారెడ్డి, పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌, కళాశాల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా అమెరికా నుంచి ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న స్వరమీడియా స్వర మ్యాగజైన్‌ నిర్వాహకులు ప్లవనామ ఉగాది సందర్భంగా జింకా సుబ్రహ్మణ్యంకు ఉగాది పురస్కారం ప్రదానం చేశారు.  జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఒంగోలుకు చెందిన సకల ఆర్ట్‌ కల్చలర్‌ అకాడమి ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రొద్దుటూరుకు చెందిన ఉపాధ్యాయుడు బాలగంగాధర్‌ తిలక్‌కు మహాత్మా జ్యోతిబాపూలే జాతీయ పురష్కారంను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి పురస్కారాలను అందజేయడంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. 

Updated Date - 2021-04-13T04:57:31+05:30 IST