నేడు టీటీడీ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం

ABN , First Publish Date - 2021-04-13T05:10:21+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్లవ నామ ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ పఠనం ఏర్పాటు చేసినట్లు ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా సమన్వయాధికారి మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

నేడు టీటీడీ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం

కర్నూలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 12: తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్లవ నామ ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ పఠనం  ఏర్పాటు చేసినట్లు ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా సమన్వయాధికారి మల్లు వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక గణేశ్‌నగర్‌లోని సీతారామాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీపాద నరేష్‌కుమార్‌చే  ఈ పంచాంగ పఠన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 


రేపటి నుంచీ రామాయణ సప్తాహం

టీటీడీ ఆధ్వర్యంలో రానున్న శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకొని బుధవారం నుంచి  ఈనెల 20 వరకు శ్రీమద్రామాయణ సప్తాహ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెంకటరెడ్డి తెలిపారు.  


నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో....

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నగర సంఘచాలక్‌ సూరా వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.   ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 


కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో...

గుత్తిరోడ్డులోని తిరుమలనగర్‌లోని అన్నపూర్ణ  సమేత కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు దేవళ్ల సాయినాథశర్మ, భక్తులు రాజు, మధు తెలిపారు. 

Updated Date - 2021-04-13T05:10:21+05:30 IST