Advertisement

యూ‌ఎఫ్‌ఓ ద్వారా త్వరలో ‘పోస్టర్’ చిత్రం విడుదల

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా టి. మహిపాల్ రెడ్డి (టి.ఎమ్.ఆర్) దర్శకత్వంలో నిర్మాతలు టి. శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి మరియు ఐ.జి రెడ్డి నిర్మించిన చిత్రం ‘పోస్టర్’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ (UFO) సంస్థ అతి త్వరలో విడుదల చేయనుంది. 

  

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘యూఎఫ్ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, అతి త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం ఉంది. మా సినిమా రిలీజ్‌లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూఎఫ్ఓ సంస్థ యాజమాన్యానికి మరియు లక్ష్మణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..’’ అని తెలుపగా హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మన ఊరిలో మన ఇంటి పక్కన, మన ఫ్రెండ్స్‌లో, మనకి జరిగిన కథలాగే ఉంటుంది. అన్ని ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంలో నటించినందుకు చాల సంతోషంగా ఉంది. యూఎఫ్ఓ సంస్థ భాగస్వామ్యం టీమ్‌కి మరింత ఎనర్జీ ఇచ్చింది అని అన్నారు. యూఎఫ్ఓ సంస్థ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పోస్టర్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా వుంది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము.. అన్నారు.

Advertisement