ఉద్యమ గిరి

ABN , First Publish Date - 2022-08-14T06:11:35+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ పవనాలు బలంగా వీస్తున్న రోజులవి. అందులో భాగంగా నెహ్రూ 1936 అక్టోబరు 18వ తేదీ వెంకటగిరికి విచ్చేశారు.

ఉద్యమ గిరి
వెంకటగిరిలో ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలు

వెంకటగిరిటౌన్‌, ఆగస్టు 13: స్వాతంత్ర్యోద్యమ పవనాలు బలంగా వీస్తున్న రోజులవి. అందులో భాగంగా నెహ్రూ 1936 అక్టోబరు 18వ తేదీ వెంకటగిరికి విచ్చేశారు. వెంకటగిరిలోని రాజా నివాసీ బాగ్‌ వద్ద సభా మండపం ఏర్పాటైంది. గూడూరుకు చెందిన దేశిరెడ్డి శేషారెడ్డి, జమీన్‌ రైతు నాయకులు వెంకట్రామనాయుడు, మరి కొంత మంది రైతు నాయకులు ఆశీనులయ్యారు. పెద్దవర్షంలో ప్రజలతో పాటు నెహ్రూగారు తడిసి ముద్దయ్యారు. జమిందారీ ప్రాంతంలోని రైతుల సమస్యలు తనకు తెలుసునని వెంకటగిరి ప్రాంత ప్రజల పట్ల తనకు సానుభూతి ఉందని, రైతుల కష్టాలు తొలగాలంటే స్వరాజ్యం ఒక్కటే మార్గమ న్నారు. అనంతరం నెహ్రూను వెంకటగిరీయులు ఘనంగా సన్మానించారు. సభానంతరం పెద్ద ఎత్తున నెహ్రూకు సత్కారం జరిగింది. నెహ్రూ ఊరేగింపు వెంకటగిరి వీధుల్లో కొనసాగింది. మేడలు, చెట్లు, గోడలపై ఎటుచూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనప్రవాహంతో వీధులన్నీ నిండిపోయాయి.  

Updated Date - 2022-08-14T06:11:35+05:30 IST