Setback for Uddhav : మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకి మరో దెబ్బ..

ABN , First Publish Date - 2022-07-30T02:07:03+05:30 IST

ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తర్వాత ఎంపీల తిరుగుబావుటాతో నిస్సహాయ స్థితిలో ఉన్న మహారాష్ట్ర(Maharastra) మాజీ ముఖ్యమంత్రి, శివసేన(Shivasena) నేత ఉద్ధవ్ థాక్రే(Uddav Thackeray)కి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.

Setback for Uddhav : మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకి మరో దెబ్బ..

ముంబై : ఎమ్మెల్యేల(MLAs) ఫిరాయింపుతో ప్రభుత్వం(Govt) కుప్పకూలడం.. ఆ తర్వాత ఎంపీల తిరుగుబావుటాతో నిస్సహాయ స్థితిలో ఉన్న మహారాష్ట్ర(Maharastra) మాజీ ముఖ్యమంత్రి, శివసేన(Shivasena) నేత ఉద్ధవ్ థాక్రే(Uddav Thackeray)కి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్ధవ్ పెద్దన్నయ్య బిందుమాధవ్ థాక్రే(లేటు) కొడుకు నిహార్ థాక్రే (Nihar Thackeray).. సీఎం ఏక్‌నాథ్ షిండే(CM Eknath Shinde)ని కలిసి మద్దతు తెలిపాడు. నిహార్ థాక్రే ఇప్పటివరకూ రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ.. పార్టీ వారసత్వం కోసం రెండు వర్గాలు మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నిహార్ థాక్రే విషయానికి వస్తే ఆయనొక లాయర్. బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కూతురు అంకిత పాటిల్‌ని గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. కాగా హర్షవర్ధన్ పాటిల్ మాజీ కాంగ్రెస్ నేత. ఆయన కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు.


కాగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కుమారుల్లో పెద్దవాడే బిందుమాదవ్ థాక్రే. 1996లో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక బిందుమాధవ్ థాక్రే సినీ నిర్మాత కావడంతో రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరు. అయినప్పటికీ ఈయన కొడుకు నిహార్ థాక్రే సీఎం షిండేకి మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక ఉద్ధవ్ రెండో అన్నయ్య జైదేవ్ థాక్రే మాజీ భార్య కూడా సీఎం ఏక్‌నాథ్ షిండేకి మద్ధతు ప్రకటించింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే రాజకీయంగా, వ్యక్తిగతంగా థాక్రే కుటుంబం మధ్య సఖ్యత లేదనేది స్పష్టమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 2012లో బాల్ థాక్రే చనిపోయాక కుటుంబంలో వివాదాలు బయటపడ్డాయి.

Updated Date - 2022-07-30T02:07:03+05:30 IST