Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 11:06:55 IST

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత తేలకుండా బలపరీక్ష ఎలా కోరతారు?.. Supreme court కు Shivasena.. సాయంత్రం 5 గంటలకు...

twitter-iconwatsapp-iconfb-icon

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత తేలకుండా బలపరీక్ష ఎలా కోరతారు?.. Supreme court కు Shivasena.. సాయంత్రం 5 గంటలకు...

ముంబై : మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్ఠంభన(Maharastra political Crisis)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బలనిరూపణ(Floor Test)  చేసుకోవాలంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే(Cm Uddav Thackerey)ని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ(Bhagat singh koshyari) ఆదేశించిన నేపథ్యంలో శివసేన(Shivasena) నాయకత్వం సుప్రీంకోర్ట్‌(Supreme court)ని ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ ‘అనర్హత నోటీసు’లపై 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా సమాధానమే ఇవ్వలేదు. అనర్హతపై తేలకుండానే బలపరీక్షకు సిద్ధమవ్వాలంటూ గవర్నర్ కోరడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు శివసేన నేత సునీల్ ప్రభు(Sunil Prabhu) సుప్రీంకోర్ట్‌లో పిటిషన్(Petetion) దాఖలు చేశారు. అయితే బలనిరూపణ ఆదేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ఎలా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్ట్ ప్రశ్నించింది. దీంతో సాయంత్రంలోగా అందజేస్తామని శివసేన తరుపు లాయర్లు తెలిపారు. అయితే బుధవారం(నేడు) సాయంత్రం 5 గంటలకు విచారణ చేపడతామని సుప్రీంకోర్ట్ తెలిపింది.


‘‘ అనర్హత నోటీసులపై 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పందించేందుకు జులై 11 వరకు సుప్రీంకోర్ట్ గడువిచ్చాక.. గవర్నర్ బలపరీక్ష ఎలా కోరతారు?. అనర్హతపై ఎటూ తేల్చకపోతే రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షలో ఎలా పాల్గొంటారు. నోటీసులకు సంబంధించిన ఇతర అంశాలు కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కదా?’’ అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ(Priyanka chathurvedi) ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో తేలకుండానే అసెంబ్లీలో బలనిరూపణ జరిగితే  కోర్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె అన్నారు.


అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోండి... గవర్నర్ ఆదేశాలు

శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేపథ్యంలో గురువారం (రేపు) బలపరీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను  ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని. లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు.  ‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కలుసుకున్నారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు’’ అని గవర్నర్ కొశ్యారీ వివరించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.