ఎన్‌ఐఏకు అప్పగించడం వెనుక ఏదో మతలబు ఉంది : సీఎం ఉద్ధవ్

ABN , First Publish Date - 2021-03-09T01:21:48+05:30 IST

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటివద్ద బాంబులతో ఉన్న వాహనం కలకం రేపిన విషయం తెలిసిందే.

ఎన్‌ఐఏకు అప్పగించడం వెనుక ఏదో మతలబు ఉంది : సీఎం ఉద్ధవ్

ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటివద్ద బాంబులతో ఉన్న వాహనం కలకం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం వెనుక ఏదో మతలబు దాగి ఉందని సీఎం ఉద్ధవ్ థాకరే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభాగాలపై ప్రతిపక్ష బీజేపీకి ఏమాత్ర నమ్మకం లేదని, ఇది నిరూపితమవుతూనే ఉందని మండిపడ్డారు. మన్‌సుఖ్ హిరెన్ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఎలా చనిపోయారన్నది బహిర్గతం చేసి తీరుతామని ఉద్ధవ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-09T01:21:48+05:30 IST