Saamna editor: సామ్నా ఎడిటర్‌గా ఉద్ధవ్‌ఠాక్రే...ఎడిటోరియల్‌లో ఎన్సీపీ, మమతాబెనర్జీలపై విమర్శలు

ABN , First Publish Date - 2022-08-08T18:40:33+05:30 IST

శివసేన(Shiv Sena) పార్టీ మౌత్ పీస్(party mouthpiece Saamna) అయిన సామ్నా పత్రిక ఎడిటర్‌గా(editor) ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) తిరిగి బాధ్యతలు చేపట్టారు....

Saamna editor: సామ్నా ఎడిటర్‌గా ఉద్ధవ్‌ఠాక్రే...ఎడిటోరియల్‌లో ఎన్సీపీ, మమతాబెనర్జీలపై విమర్శలు

ముంబయి(మహారాష్ట్ర): శివసేన(Shiv Sena) పార్టీ మౌత్ పీస్(party mouthpiece Saamna) అయిన సామ్నా పత్రిక ఎడిటర్‌గా(editor) ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) తిరిగి బాధ్యతలు చేపట్టారు. పాత్ర చావల్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శివసేన ఎంపీ, సామ్నా(Saamna) చీఫ్ ఎడిటర్ సంజయ్ రౌత్ అరెస్టు అనంతరం ఉద్ధవ్ ఠాక్రే సంపాదకీయం రాశారు.ద్రవ్యోల్బణం (inflation), నిరుద్యోగం(unemployment), నిత్యావసర సరకులపై జీఎస్టీ పెంపు పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చినా, ఆయా నిరసన కార్యక్రమాల్లో ఎన్సీపీతో(ncp)పాటు మమతాబెనర్జీ తృణమూల్ పార్టీలు(West Bengal Chief Minister and Trinamool Congress supremo Mamata Banerjee)పాల్గొనక పోవడంపై సామ్నా సంపాదకీయంలో విమర్శలు గుప్పించారు.


ప్రతిపక్షాల నేతలపై కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐలతో దాడులు చేపిస్తూ వేధిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో ప్రతిపక్షాల నేతలు పాల్గొనక పోవడాన్ని ఉద్ధవ్ ఠాక్రే తన సంపాదకీయంలో తప్పు పట్టారు.రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు శివసేనకు చెందిన సంజయ్ రౌత్ లను అరెస్టు చేసేటప్పుడు పోలీసులు చూపించిన ప్రతాపాన్ని సామ్నా ఖండించింది.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతల పాత్రను ప్రశ్నార్థకం చేస్తూ ఈడీ దాడులు చేయడాన్ని ఉద్ధవ్ తన సంపాదకీయంలో వ్యతిరేకించారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించారు.


Updated Date - 2022-08-08T18:40:33+05:30 IST