Udayanidhi సేవలు రాష్ట్రానికి అవసరం

ABN , First Publish Date - 2022-05-06T15:44:35+05:30 IST

డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ సేవలు ఒక నియోజకవర్గానికి పరిమతం కారాదని, రాష్ట్రమంతా అవసరమని, దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని

Udayanidhi సేవలు రాష్ట్రానికి అవసరం

                           - ఎమ్మెల్యే ప్రభాకరన్‌


పెరంబూర్‌(చెన్నై): డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ సేవలు ఒక నియోజకవర్గానికి పరిమతం కారాదని, రాష్ట్రమంతా అవసరమని, దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని పెరంబలూరు ఎమ్మెల్యే ప్రభాకరన్‌ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం రవాణా శాఖ, పర్యాటక, కళలు, సంస్కృతి శాఖల పద్దులపై చర్చ జరిగింది. చర్చల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభాకరన్‌ మాట్లాడుతూ, ఒక రాయి, ఒక అద్దం (ఒరు కల్‌...ఒరు కన్నాడి) అని సాధారణం గా మాట్లాడుకుంటారని, కానీ ఒకే ఒక ఇటుకతో కేంద్రప్రభుత్వాన్ని ఎదిరించిన వ్యక్తి ఉదయనిధి అనికొనియాడారు. ఆయన సేవలు, కృషి ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కారాదని, భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఆయన సేవలు విస్తరించాలని, అందుకు సీఎం దృష్టి సారించాలని  కోరారు. ఉదయ నిధి త్వరలో మంత్రి పదవి చేపట్టానున్నారనే వార్తల మధ్య శాసనసభలో ఆ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.

Read more