Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 10:14AM

నన్ను ఆశీర్వదించండి

- తల్లిదండ్రులకు మొక్కిన ఉదయనిధి

- వాడవాడలా యువనేత జన్మదిన వేడుకలు


అడయార్‌(చెన్నై): డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, చెప్పాక్కం - ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధి 44వ జన్మదిన వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా తన కుమారుడికి సీఎం స్టాలిన్‌, దుర్గా దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమారుడికి బంగారువర్ణపు శాలువా కప్పిన సీఎం స్టాలిన్‌ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఉదయనిధి తన తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి ఆశీస్సులందుకున్నారు. అలాగే, అనేక మందికి వివిధ రకాలైన సంక్షేమ సాయాలను డీఎంకే నేతలు అందజేశారు. పలు ప్రాంతాల్లో వివిధ రకాలైన వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. 

నేతల సమాధులకు నివాళులు

ఉదయనిధి తన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు నేతల స్మృతి స్థలాలకు వెళ్ళి నివాళులు అర్పించారు. ముందుగా మెరీనా తీరంలో ఉన్న అన్నాదురై, కలైంజర్‌ కరుణానిధి సమాధుల వద్దకు వెళ్ళి అంజలి ఘటించారు. ఆ సమయంలో ఆయన వెంట మంత్రి అన్బిల్‌ మహేష్‌, సెంట్రల్‌ చెన్నై ఎంపీ దయానిధి మారన్‌, జిల్లా కార్యదర్శి సిట్రరసు తదతరులు ఉన్నారు. 


వెల్లువెత్తిన నేతల శుభాకాంక్షలు

ఉదయనిధి స్టాలిన్‌కు డీఎంకే నేతలు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీపడ్డారు. వీరిలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌.బాలు, ముఖ్య కార్యదర్వి కేఎన్‌ నెహ్రూ, ఉప ముఖ్య కార్యదర్శి పొన్ముడి, ఎంపీ ఏ.రాజా, మంత్రులు ఎం.సుబ్రహ్మణ్యం. టీఎం అన్బరసన్‌, శేఖర్‌బాబు, ఆవడి నాజర్‌, ఆర్‌.గాంధీ, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, కేఆర్‌.పెరియకరుప్పన్‌, సీవీ గణేశన్‌, శివశంకరన్‌, మెయ్యనాథన్‌, మనో తంగరాజ్‌ తదితరులు ఉన్నారు. 


2,045 మందికి సంక్షేమ సహాయాలు

ఉదయనిధి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక పెరంబూరులో వర్షబాధితుల్లో 2045 మందికి సంక్షేమ సాయాలను రాష్ట్ర మంత్రి అన్బిల్‌ మహేష్‌ పంపిణీ చేశారు. పెరంబూరు నియోజకవర్గం పరిధిలోని ఎరుంకంజేరిలోని ఒక ప్రైవేటు కాలేజీలో జరిగిన కార్యక్రమంలో  వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, కుట్టు మిషన్లు, గ్రైండర్‌, కుక్కర్లు, బియ్యం తదితర సాయాలను పంపిణీ చేశారు.

Advertisement
Advertisement