నెల్లూరు: వైసీపీ నేతలకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేసిన జెడ్పీటీసీ చేజర్ల సుబ్బారెడ్డి, నేతలపై మేకపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో గోడలకు నీళ్లు పట్టుకొని బతికినవాళ్లు తన గురించి విమర్శిస్తే తరిమి కొడతానని... తాను ఎలాంటి వాడినో ఉదయగిరి ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే అన్నారు. తన హయాంలో చాలా మందినిని నాయకులుగా తయారు చేశానన్నారు. తన దగ్గర ఎదిగి తననే విమర్శిస్తారా? అని మండిపడుతూ రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.