ttd: శ్రీవారి సేవలో సీజేఐ

ABN , First Publish Date - 2022-10-02T01:56:17+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడోత్సవం సందర్బంగా తిరుమలకు

ttd: శ్రీవారి సేవలో సీజేఐ

తిరుమల: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడోత్సవం సందర్బంగా తిరుమలకు చేరుకున్న ఆయన మఽధ్యాహ్నం మూడు గంటలకు ఆలయంలోకి వెళ్లిశ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి  లడ్డూ ప్రసాదాలను అందజేశారు.


శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు సీజే

ఏపీ హైకోర్టు న్యాయయూర్తి జస్టిస్‌  ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాల యంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. అనం తరం రంగనాయక మండపంలో జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడి, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు.అనంతరం తమిళనాడు హైకోర్టు సీజే డి.రాజాతో కలసి జస్టిస్‌  ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బ్రహ్మోత్సవాల్లో  పాల్గొన్నారు.మోహినీ అవతార సేవలో కృష్ణస్వామి వాహనాన్ని కాసేపు ఇద్దరూ మోశారు.


టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం

టీటీడీ నిర్వహిస్తున్న శ్రీతరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్టుకు విజయవాడకు చెందిన నందిని ఫార్మా అధినేత జక్కా సీతారామాంజనేయులు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. తిరుమలలో శనివారం ఆయన టీటీడీ చైర్మన్‌  సుబ్బారెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.  

Updated Date - 2022-10-02T01:56:17+05:30 IST