చరిత్రలో కొత్త మైలురాయి! కరోనాకు ముందు.. ఆ తరువాత...

ABN , First Publish Date - 2020-06-05T01:14:07+05:30 IST

కరోనా కారణంగా మానవ జీవితంలో అనంతమైన మార్పు వచ్చింది. మాస్కులు, శానిటైజర్లలో ఓ భాగమైపోయింది. ఓ రోజులో ఎక్కువ సార్లు జ్ఞప్తికి వచ్చే పదం కరోనా అంటే అతిశయోక్తి కాదేమో.

చరిత్రలో కొత్త మైలురాయి! కరోనాకు ముందు.. ఆ తరువాత...

ముంబై: కరోనా కారణంగా మానవ జీవితంలో అనంతమైన మార్పు వచ్చింది. మాస్కులు, శానిటైజర్లు నిత్యజీవితంలో ఓ భాగమైపోయాయి. ఒక రోజులో ఎక్కువ సార్లు జ్ఞప్తికి వచ్చే పదం కరోనా అంటే అతిశయోక్తి కాదేమో. కాలానికి కూడా కరోనా కొలమానంగా మారినా.. భూత, భవిష్యత్ కాలాలను కరోనా ఆధారంగా నిర్వచించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కోటక్ మహింద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ ఈ అనుభవాన్ని మరింత స్పష్టంగా వివరించారు. ఆంగ్లలోని ఏసీ, బీసీ సంక్షిప్త రూపాలు కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజిస్తాయన్న విషయం తెలిసిందే. ఉదయ్ కోటక్ మాత్రం.. బీసీ అంటే బిఫోర్ కరోనా(కరోనాకు ముందు) ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా(కరోనా తరువాత) అని భావించాలంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం నివసిస్తున్న కరోనా కాలాన్ని డీసీ(డ్యూరింగ్ కరోనాగా) పేర్కొనాలంటూ ముక్తాయించారు. 

Updated Date - 2020-06-05T01:14:07+05:30 IST