Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 13:51:05 IST

Udaipur tailor murder : పాక్ ఉగ్ర సంస్థ స్లీపర్ సెల్స్ పనే: ఇంటెలిజెన్సీ వర్గాలు.. 26 సార్లు నరికినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడి

twitter-iconwatsapp-iconfb-icon
Udaipur tailor murder : పాక్ ఉగ్ర సంస్థ స్లీపర్ సెల్స్ పనే: ఇంటెలిజెన్సీ వర్గాలు.. 26 సార్లు నరికినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడి

ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ (Kanhaiya Lal) తల నరికివేత (Udaipur tailor murder) ఘటన పాకిస్తాన్(Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థ‌(Terror Outfit)కు చెందిన స్లీపర్ సెల్స్(Sleeper cells) పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. కాగా ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. 10 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా దారుణ హత్యపై NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరపనుందని కేంద్ర హోమంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ హత్యలో విదేశీ తీవ్రవాదులు లేదా ఉగ్రసంస్థలు, విదేశీ కుట్రలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుందని హోంశాఖవర్గాలు వివరించాయి.


కన్హయ్యా లాల్‌ను 26 సార్లు నరికారు..

ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌()ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టు‌మార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. కాగా ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యా లాల్ స్వస్థలం మల్దాస్ ప్రాంతంలో అంత్యక్రియ జరగనుంది. అతడి ఇంటికి ఇప్పటికే పెద్దమొతంలో జనాలు చేరుకున్నారు. పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చారు.


నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని.. 

మహ్మద్‌ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పది రోజుల క్రితం కన్హయ్యాలాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులకు, కన్హయ్యకు మధ్య వాడివేడి వాదనలు జరిగాయి.  అనంతరం కన్హయ్యాలాల్‌కు వారి నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్నాళ్లు షాపు మూసేసి అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కాగా హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు ఐసిస్‌ ఉగ్రవాదకు సంస్థకు లేదా పాక్‌ ఉగ్రవాద సంస్థకు లింకులున్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మాత్రం ఈ ఘటనను ‘పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద చర్య’గా భావిస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలు జరిగిన ఈ దారుణానికి సంబంధించిన నిందితులు వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో వీడియోలో ఇద్దరు నిందితులు తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బెదిరించారు. అందులో ఓ వ్యక్తి.. ‘నా పేరు మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌. నా పక్కన ఉన్నది ఘోష్‌ మహమ్మద్‌ భాయ్‌ (మహ్మద్‌ ఘోష్‌). ఉదయ్‌పూర్‌లో ఒకరి తల నరికేశాం. ఏయ్‌.. నరేంద్ర మోదీ, విను! నిప్పు నువ్వు రాజేశావు. మేం ఆర్పుతాం. ఇన్షా ఆల్లా.. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది. ఉదయ్‌పూర్‌ వాస్తవ్యులారా.. ఇప్పుడు ఒక్కటే నినాదం. తప్పు చేస్తే తల తెగిపడుతుంది’ అని వ్యాఖ్యానించాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.