NIA కస్టడీలో ఉదయపూర్ హంతకులు...పెద్ద పని చేయాలంటూ నిందితులను రెచ్చగొట్టిన pak హ్యాండ్లర్లు

ABN , First Publish Date - 2022-07-02T15:26:28+05:30 IST

ఉదయ్‌పూర్ నగరంలోని టైలర్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ముహమ్మద్ రియాజ్, గౌస్ ముహమ్మద్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ ...

NIA కస్టడీలో ఉదయపూర్ హంతకులు...పెద్ద పని చేయాలంటూ నిందితులను రెచ్చగొట్టిన pak హ్యాండ్లర్లు

జైపూర్(రాజస్థాన్): ఉదయ్‌పూర్ నగరంలోని టైలర్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ముహమ్మద్ రియాజ్, గౌస్ ముహమ్మద్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం కస్టడీలోకి తీసుకుంది.ఉదయపూర్ హత్య కేసు దర్యాప్తును అధికారికంగా చేపట్టిన ఒక రోజు తర్వాత శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో నిందితులను ప్రశ్నించనుంది.శనివారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని హై సెక్యూరిటీ జైలుకు ఎన్‌ఐఏ బృందం చేరుకుని ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. 


భారీ బందోబస్తుతో నిందితులను జైపూర్‌ నగరానికి తరలిస్తున్నారు.నిందితులు ముహమ్మద్ రియాజ్, గౌస్ ముహమ్మద్‌లకు ఏదో పెద్ద పని చేయాలని పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లు సల్మాన్ హైదర్, అబూ ఇబ్రహీంలు రెచ్చగొట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల ద్వారా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై వివాదం నేపథ్యంలో ఇద్దరు నిందితులను రెచ్చగొట్టి పెద్ద దాడికి పాల్పడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.నిందితులు తీవ్రవాద దాడులు చేసేందుకు ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడైంది. 


Updated Date - 2022-07-02T15:26:28+05:30 IST