ఉచిత విద్యుత్‌పై కుట్ర

ABN , First Publish Date - 2022-07-06T06:48:56+05:30 IST

ఉచిత విద్యుత్‌పై కుట్ర

ఉచిత విద్యుత్‌పై కుట్ర
హనుమాన్‌జంక్షన్‌లో నిరసన తెలుపుతున్న అఖిలపక్ష రైతుసంఘం నేతలు

హనుమాన్‌జంక్షన్‌లో స్మార్ట్‌ మీటర్లు వ్యతిరేకిస్తూ అఖిలపక్ష  రైతు నేతల నిరసన 

 హనుమాన్‌జంక్షన్‌, జూలై 5 : వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత విద్యుత్‌ పథకాన్ని రద్దు చేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నా యని, ఈ విధానాన్ని ఉపసంహరించకపోతే రైతు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని అఖిపక్ష రైతు సంఘాల నేతలు హెచ్చరిం చారు. మంగళవారం హనుమాన్‌ జంక్షన్‌లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యని ర్వాహాక కార్యదర్శి  గుండపనేని ఉమావర ప్రసాద్‌ అధ్యక్షతన కాకాని కల్యాణ మండ పంలో జరిగిన సదస్సులో  ఏపీ రైతు సం ఘం నేతలు వై.కేశవరావు,  వేములపల్లి శ్రీని వాసరావు,  నండూరు సత్వవెంకటేశ్వర శర్మ, చలమల శెట్టి రమేష్‌బాబు,  తుమ్మల అంజి బాబు తదితరులు మాట్లాడుతూ, ఉచిత విద్యుత్‌సాయంతో మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలు పండించే రైతాంగం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయాన్ని వదులు కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సు అనంతరం కల్యాణ మండపం నుంచి హనుమాన్‌ జంక్షన్‌లో విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం వరకు పెద్ద ఎత్తన  నిరసన ప్రదర్శన నిర్వ హించారు. అనంతరం ఏడీఈ బి.శ్రీనివాస రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాల రాజేశ్వ రరావు, పుట్టా సురేష్‌, బేత శ్రీనివాసరావు,  అట్లూరి శ్రీనివాసరావు, యనమదల దాసు, కలపాలసూర్యం, తోట సాంబశివరావు, పర్వతనేని రాజేంద్ర, మూల్పూరి ధనకోటేశ్వ రరావు, పాతూరి సత్యనారాయణ, శ్రీనివాస రావు, టి.జగన్‌, రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:48:56+05:30 IST