సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు యూబీఐ తోడ్పాటు

ABN , First Publish Date - 2022-08-09T05:51:27+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెన్నెముఖ వంటివని, వాటికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) తోడ్పాటునం దిస్తుందని ఏపీఐఐసీ జెడ్‌ఎం రంగయ్య పేర్కొన్నారు.

సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు యూబీఐ తోడ్పాటు
సమావేశంలో పారిశ్రామికవేత్తనుద్దేశించి మాట్లాడుతున్న జెడ్‌ఎం రంగయ్య

ఏపీఐఐసీ జెడ్‌ఎం రంగయ్య 

ఆటోనగర్‌, ఆగస్టు 8: భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెన్నెముఖ వంటివని, వాటికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) తోడ్పాటునం దిస్తుందని ఏపీఐఐసీ జెడ్‌ఎం రంగయ్య పేర్కొన్నారు. సోమవారం  యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో విశాఖ ఆటోనగర్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ కార్యాలయంలో పరిశ్రమల నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైక్రో ఇండస్ట్రీస్‌ మొదలుకుని అన్ని రకాల పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనందిచేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ముందుంటుందన్నారు. అందువల్ల పరిశ్రమల నిర్వహణకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఏజీఎం తిలక్‌ మాట్లాడుతూ గతంలో అనేక పరిశ్రమలకు రుణ సదుపాయం అందించామన్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంక్‌లు అన్నివిధాలుగా సహకరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అవకాశాన్ని పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐలా చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ బ్యాంకులు కల్పిస్తున్న అవకాశాలను ఔత్సామిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐలా కమిషనర్‌ కె.సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంలకు తోడ్పాటు అందించేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. ఐలా వైస్‌ చైర్మన్‌ కొల్లి ఈశ్వరరావు, కార్యదర్శి చీకటి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన వారంతా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ జి.అప్పారావు, మార్కెటింగ్‌ అధికారి మోహన్‌రాజ్‌, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:51:27+05:30 IST