వడ్డీ రేట్లు తగ్గించిన యూబీఐ

ABN , First Publish Date - 2020-09-11T06:25:43+05:30 IST

మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గించాయి. అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు...

వడ్డీ రేట్లు తగ్గించిన యూబీఐ

న్యూఢిల్లీ: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గించాయి. అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గిస్తున్నట్టు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), యూకో బ్యాంక్‌ ప్రకటించా యి. యూకో బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటు తగ్గింపు గురువారం నుంచి, యూబీఐ తగ్గింపు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఈ తగ్గింపు అన్ని కాలపరిమితి రుణాలకూ వర్తిస్తుందని రెండు బ్యాంకులు తెలిపాయి. దీంతో ఏడాది కాల పరిమితి ఉండే యూకో బ్యాంక్‌ రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటు 7.4 శాతం నుంచి 7.35 శాతానికి తగ్గుతుంది. ఏడాది కాల పరిమితి ఉండే యూబీఐ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు మాత్రం 7.25 శాతం నుంచి 7.20 శాతానికి తగ్గుతుంది.

Updated Date - 2020-09-11T06:25:43+05:30 IST